తలపుల రంగవల్లులేసి
తలుపులు తెరచి
తలవాకిట నీ రాకకై వేచిన
తరుణము రానే వచ్చెగా!
తొలి కిరణం తాకగానే
నులి వెచ్చగ మనసు విచ్చి
తెలి వెలుగుల కాంతులలో
తేలితేలి నింగిలో పయనించె గా!
బ్రతుకుదారి పొడవునా
ఎదురు దెబ్బతగిలినా
బెదురు అసలు లేకుండా
చెదరిపోక నడిపేది నీవేగా!
గతమంత కలలాగానే
కరిగి గడిచిపోయి
దూరాన పచ్చగ వెలిగే
తీరమేదో సుందరమై తోచెగా!
ఈనాటి అవకాశం బహుమతిగా
రేపటి చీకటి తొలగించుకునే
వేకువ రాగమేదో ఎదమీటి
మేలుకొలుపు పాడేనుగా!
నీ చల్లని కృప నాకు
నభమంత నిండి
కనపడని గొడుగులా
మనసుకు తోడుగా నిలిచెగా!
జగతికి సుగతిని తెలుపుటయే
దినకర నీ నియమము నిజము
జగమున జీవిని నేను
నను బ్రోవక ఉండవుగా?
రక్షించు తండ్రికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి