ఏడాది లో తొలి నెల జనవరిలో జన్మించిన కొందరు మహాపురుషులు న్నారు.సంక్షిప్తంగా వారిని గూర్చి చిరు సమాచారం
1 మైసూర్ మహారాజు సంస్థానంలో ఆయన 15ఏళ్లు దివాన్ గా పనిచేశారు.ఈయన పూర్వీకులు ఇరాన్ నుంచి వచ్చి గుర్రాలు తివాసీలు అమ్ముతూ క్రమంగా జాగీర్దారులైనారు.ఈయన తిరువాన్కూర్ కొచ్చిన్ జోధ్పూర్ జైపూర్ సంస్థానాలలో కూడా పనిచేసి ఎన్నో సంస్కరణలతోఅందరి మన్నన పొందారు.జిన్నా ని సమర్ధించలేదు. ఎంత నిర్మొహమాటంగా తన పుస్తకంలో రాశారో చదవండి" రాజకీయాలను వృత్తి గా భావించే అనుభవం పరిపాలనా దక్షత లేనివారుండటం దురదృష్టం." నేటికీ అది అక్షరసత్యం!! మైసూర్ బెంగళూరు నుంచి అందమైన నగరాలుగా తీర్చిదిద్దారు.1941లో మైసూర్ మహారాజు మరణంతో దివాన్ పదవినుంచి వైదొలగిన ఆయన 5జనవరిలో అస్తమించారు.జనవరి 4 నా జన్మించిన ఆయన లండన్ లో ఉద్యోగం చేశారు.ఆపై గాంధీజీకి అత్యంత సన్నిహితుడైన గుజరాత్ విద్యాపీఠం లో ఆచార్యునిగా యంగ్ ఇండియా పత్రిక ఎడిటర్ గా ప్రజలకు ఉద్యమవిశేషాలుపూసగుచ్చినట్లు వివరించేవారు.ఆర్థికసిద్ధాంతాలపై 12పుస్తకాలు రాశారు.ఢిల్లీ సచివాలయంలో కి గుర్రపుబండీలో వెళ్లిన ఈయనను లోపలికి అనుమతించలేదు.కేవలం కార్లలో ఉన్న వారే రావాలి అనటంతో జీవితాంతం మళ్ళీ అటువైపు వెళ్ళలేదు.చైనా రష్యా మొదలైన దేశాల్లో గాంధీ సిద్ధాంతాలు ప్రచారం చేసిన ఆయన 30జనవరి 1960లో మరణించారు.విలువలు క్షీణిస్తున్నాయని అధికార లాలస పెరిగింది అని రాజేంద్రప్రసాద్ తో మొరపెట్టుకున్నారు.నిజమైన దేశ భక్తులకు ఆనాడే అన్యాయం జరిగిందని ఈయన జీవిత చరిత్ర తెలిస్తే అర్థం అవుతుంది.తిరుచానూరులో వైష్ణవ కుటుంబంలో పుట్టి న్యాయ వాది గా ఎదిగి ఖాదీ ఉద్యమం మద్యపాన నిషేధం కై పాటుపడ్డారు.లోక్సభలో 28 ఏళ్ల అనుభవం ఉపసభాపతి గా ఆయన వాక్చాతుర్యం అందర్నీ ఆకట్టుకుంది.కుష్టురోగులకు నేరాలు చేసిన ఆటవికులపై దృష్టి సారించారు.కేంద్రీయసంస్కృతపీఠాధ్యక్షునిగా ఆయన ప్రసంగాలు జలజలపారే సెలయేరు అని కొనియాడారు ఆనాటి ప్రముఖులు.19జనవరినఅమరులైనారు.జననం జనవరి 14.బీదరికంలోనే దీక్ష తో చదివి లాడిగ్రీ పొందిన ఆయన ఆంగ్ల హిందూ డైలీ పేపర్ సంస్థాపకులలో ఒకరుగా గుర్తింపు పొందిన తెలుగు తేజం.కందుకూరి వీరేశలింగం పంతులు గారి కి కుడిభుజం.విదేశాలనుండి స్వామి వివేకానంద మనదేశం కి తిరిగి రాగానే ఆయన కి పూలమాల సమర్పించిన ఘనత వీరికే దక్కింది.84వ ఏంటి జనవరి 5 న కీర్తి శేషులైనారు.
మరి ఎందరో మహానుభావులు.అందరికీవందనాలు.
🌹వీరి పేర్లు అందరికీ సుపరిచితమే.ఆలోచించగలరు.
=========================================
జవాబులు1దివాన్ మీర్జా ఇస్మైల్ 2 జె.సి.కుమరప్ప 3అనంతశయనం అయ్యంగార్
4ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావు పంతులు 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి