అమ్మలేని లోటు:- కట్టగూరి మానస-ఎనిమిదవ తరగతి-వల్లాల ఆదర్శ పాఠశాల
 అనగనగా ఒక ఊరు ఉండేది,ఆ ఊరిలో ఒక కుటుంబం చాలా సంతోషంగా ఉండేది, అమ్మ,నాన్న, అన్నయ్య, చెల్లి వాళ్లు అమ్మానాన్న ఎప్పుడు ఏ గొడవ లేకుండా చాలా సంతోషంగా ఉండేవారు, ఎదుటి వాళ్లకు సాయం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉండేవారు, వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు వాళ్ళ పిల్లలని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉంచేవారు, ఎందుకంటే వాళ్ళ అమ్మానాన్న చేసే కష్టం వాళ్ళు చూడకుండా అక్కడ ఉంచేవారు, కానీ వాళ్ళ అమ్మానాన్నలు పిల్లలను విడిచి ఉండలేక వాళ్ల దగ్గరికి తీసుకొని వచ్చారు, ఎందుకంటే వేరే వాళ్ళ పిల్లలని చూసి వాళ్ళ అమ్మ బాధపడింది,అందుకే వాళ్లను తీసుకొని వచ్చారు, ఇప్పుడు వాళ్లు ఆనందంగా ఉంటున్నారు,వాళ్ళకొక గుడిసె ఉండేది, వర్షాకాలంలో వానలు వచ్చి మొత్తం కురిసేది, వాళ్ళ అమ్మానాన్న చాలా బాధ పడేవారు, వాళ్ళ అమ్మకి ఒక ఆలోచన వచ్చింది, అది వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉంటుందని, పగలనకా రాత్రనకా కష్టపడి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో చాలా ఆనందంగా ఉంటున్నారు, కానీ ఇంతలో అనుకోకుండా వాళ్ళ అమ్మ చనిపోయింది, అంతకు ముందు నలుగురు ఉండేవారు, ఇప్పుడు ముగ్గురు మాత్రమే మిగిలిపోయారు, వాళ్ళు చాలా బాధపడేవారు, వాళ్ల నాన్న చాలా మంచివాడు, వాళ్ళ పిల్లలకు ఏ లేటు లేకుండా చూసుకుంటున్నాడు, కానీ వాళ్ళ పిల్లలకు చాలా బాధ వేస్తుంది, కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ నాన్న కోసం వాళ్లు కూడా ఏమీ బాధ లేనట్లు ఉంటున్నారు, వాళ్ళ నాన్నకు కూడా ఎంతో బాధ ఉంటుంది, కానీ వాళ్ల పిల్లలకు తెలియకూడదు అని, దుఃఖాన్ని దిగమింగుతుండు తను ఎంత కష్టపడ్డా వాళ్ళ పిల్లల కోసమే తన భార్యను తలుసుకొని చాలా బాధపడతాడు, ఏ కుటుంబంలోనైనా ఒకరు వేరే ఊరికి వెళ్తేనే ఎంతో బాధ వేస్తుంది,కానీ వాళ్లకు అమ్మ జీవితాంతం లేదని తలుచుకుంటూ ప్రతిక్షణం బాధపడేవారు, వాళ్ళ నాన్న, వాళ్ళకి అన్నీ పనులు చేస్తూ ఉండేవాడు, అందరూ సంతోషంగా ఉండేవారు, కానీ వాళ్ళ అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో వాళ్లు ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నారు, ఒకప్పుడు వాళ్ళ అమ్మాయి ఇతరులకు సహాయం చేసేది,కానీ ఇప్పుడు ఆ పిల్లలకు ఎవరు కూడా సహాయం చేయడానికి ఒకరు కూడా లేరు, ఎప్పుడైనా వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ల ఇంటికి వచ్చేవారు, కానీ వాళ్ళ అమ్మ లేకుంటే ఎవరూ వాళ్ళ ఇంటి వైపు కూడా చూడడం లేదు, సూర్యుడు లేకుంటే ఎంత చీకటి ఉంటుందో, వాళ్లకి వాళ్ల అమ్మ లేకుంటే అలానే ఉంటుంది,ఎవరికైనా ఎప్పుడైనా పండుగ వస్తుందంటే చాలా సంతోషంగా ఉంటారు, కానీ వాళ్లు మాత్రం దుఃఖంతో ఉండేవారు, కానీ లేని వాళ్ళు మళ్ళీ తిరిగి రారుగా అని వాళ్ళు అనుకునే వాళ్ళు, పిల్లలు వాళ్లకి అమ్మాయి అయినా నాన్న అయినా,తానే అనుకొని ఉంటున్నారు, వాళ్ళు ఎల్లప్పుడూ నాన్ననే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటున్నారు.

కామెంట్‌లు