బావుటా!:- అచ్యుతుని రాజ్యశ్రీ

 వందేమాతరం మన పథం
మందేభారతం మనరథం
వేదమాత పుణ్యచరిత భరతజాతి శక్తియుక్తి చిత్తశుద్ధి
సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశం
సత్యాహింసల శాంతి సందేశం
కర్తవ్యపథ్ పై కదిలే శకటాలు 
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదాలు
మనదేశం భగవద్గీత 
మనకాదర్శం సీతామాత పుణ్యచరిత
తంత్రమంత్ర కుట్ర కుతంత్రాలెరుగని మనదేశం
ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసంతో తొట్రుపడదు లవలేశం
పురజన గిరిజన తేడాలేని 
సర్వభాషా కవిసమ్మేళనంలో
ఇంద్రధనుస్సులా మురిసె మనస్సులు
భక్తి శక్తి వేదమాత గాయత్రి భారతి
వివేకానంద సింహగర్జనతో 
జూలువిప్పి కదంతొక్కుతూ 
సాగుతోంది యువత 
ఐక్యత సామరస్యత భిన్నత్వంలో ఏకత్వం అపూర్వం నవభారతం
నిరంతరం చిరంతరం వేదఘోషతో 
శివాత్మకం లయాత్మకం సృజనాత్మకం మనదేశం
జగానికొసగు తరతరాల శాంతిసందేశం🌹
కామెంట్‌లు