ఒక గ్రామంలో అత్త,కోడలు ఇద్దరు అప్పడాల బేరం చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూ వుంటారు.రోజు కోడలి కంటే అత్త కు అప్పడాల బేరంలో ఎక్కువగా లాభం వస్తుంది. రోజు అత్తకు ఎక్కువ బేరం అవడం వల్ల అత్త ఎప్పుడు కోడలిని వేగతాలి చేస్తూవుంటుంది.ఏమో కోడల నీకు ఈ అప్పడాల బేరం చేయడానికి కూడా రాదు ఎప్పుడు తిని కూర్చోవడమే కాదు కొంచం బేరం చేయడం కూడా నేర్చుకొని చావు.అని రోజు కోడలిని తిడుతూనే వుంటుంది,కోడలు ఏడుస్తూ వెళ్తుంది. అలానే మరుసటి నాడు కూడా అప్పడాల బేరంకు అత్త,కోడలు ఇద్దరు కలిసి వస్తారు. ఇదిగో కొడలి పిల్ల ఈ రోజు ఐన సక్కగా సేయ్ బేరం అని అంటుంది. సరే అత్త అని కోడలు అని ఈ రోజు ఐన మంచిగా బేరం అయ్యేలా చూడు దేవుడా అని వ్యాపారం మొదలు పెడుతోంది.ఆ రోజు కూడా బేరం అత్తకే ఎక్కువగా అవుతుంది. అప్పుడు ఒక ముసలావిడ చాలా ఆకలితో అత్త ఇంటికి వెళ్లి అమ్మా చాలా ఆకలిగా వుంది తల్లి నీకు దండం పెడుత కొంచం అన్నం వుంటే పెట్టమ్మ అని చాలా ఆశగా అడుగుతుంది. అప్పుడు అత్త ఎవరమ్మ నువ్వు ఇక్కడ నాకే లేదు అంటే నువ్వు వచ్చి అరుస్తున్నవ్ అని అంటుంది .ఆ ముసలావిడా కొడలి దగ్గరకు వెళ్లి చాలా బాధగా కూర్చుంటుంది.అప్పుడు కోడలు ముసలావిడ దగ్గరకు వెళ్లి ఏం ఐనది అవ్వ చాలా బాధగా కూర్చున్నావ్ అని అడుగుతుంది.చాలా ఆకలిగా వుంది తల్లి ఎవరిని అడిగినా నా ఆకలిని తీర్చడమే లేదు అని అంటుంది. అప్పుడు అత్త ఇంట్లో నుండి బయటకు వచ్చి దానికే ఏం గతి లేదు ఇంకా నీకేమీ వేస్తది అని వేగతాలిగా అంటుంది. అప్పుడు కోడలు ముసలావిడను రా అవ్వ మా ఇంట్లో కి అని తీసుకొని పోయి అవ్వ నా దగ్గర ఈ అప్పడాలు వున్నాయి తిను అవ్వ అని కడుపునిండా పెడుతోంది.అప్పుడు ముసలావిడ కృతజ్ఞతలు తల్లి నా ఆకలిని తెలుసుకొని నా కడుపునింపావు అని అంటుంది. దాంట్లో ఏం వుంది అవ్వ అని చిరునవ్వుతో అంటుంది. నా ఆకలి తీర్చినందుకు నీకు ఏం ఇచ్చిట తక్కువనె తల్లి నా దగ్గర ఇవ్వడానికి కూడా ఏమి లేదు తల్లి నా దగ్గర వున్నాదిఅంటూ ఒక్కటే తల్లి ఈ కర్ర ఇది మామూలు కర్ర కాదు తల్లి మాయ కర్ర🪄. అదేంటి అవ్వ. అవును తల్లి ఈ నీకు అదైనా బాధగా వున్నప్పుడు ఈ కర్రతో చెప్పు తల్లి ని బాధలను తీర్చే కర్ర ఇది తీసుకొ తల్లి వద్దు అనకుండా అని ఆ కర్ర ను ఇచ్చి ముసలావిడ మాయం అవుతుంది. అలాగే మరుసటి నాడు రోజు లాగే బేరం కి వెళ్లింది మళ్లీ బేరం కాకపోవడం తో కోడలు బాధతో ఇంటికి తిరిగి వచ్చి కూర్చొని ఆలోచించాగా కూడలికి మాయ కర్ర గుర్తుకు వచ్చి తనకు జరిగినది మొత్తం చేపుతుంది అలా చెప్పి బేరంకి వెళ్లినప్పుడు కోడలికి ఎక్కువగా లాభం వస్తుంది అలా రోజు రావడంతో కోడలు ధనవంతురాలుగా మారిపోయింది. అది చూసిన అత్త చాలా ఆచార్యపోతుంది,అప్పుడు కొడలి దగ్గరకు వెళ్లి ఏమే కోడల అంత పెద్ద ధనవంతురాలు ఐనవు అలా ఎలా అని అడగడంతో కోడలు జరిగినది మొత్తం చెప్పుతుంది .అప్పుడు అత్త తన తప్పును తెలుసుకొని చాలా బాధ పడుతుంది .ఇంటికి వచ్చి సహాయం కోరిన వారికి మనదాంట్లో వున్నంతనైన సహాయం చెయ్యాలి అని అనుకుంటుంది
==============================
కృతజ్ఞతలు
ఉపాధ్యాయురాలు :త్రిపురారి పద్మ
కోడలి సహాయం :- బి.శిరీష -రామరాజుపల్లే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి