జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, కడుము పాతపొన్నుటూరు పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు రచనలు హంసవాహిని సంకలనంలో స్థానం పొందాయి. శ్రీకాకుళం శాంతి నికేతన్ ఆవరణలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో నేడు జరిగిన నూరవ నెల సాహితీ ప్రస్థాన వేదికపై ఆవిష్కరించబడిన హంసవాహిని సంకలనంలో తిరుమలరావు రచించిన మూడు కవితలు ప్రచురితమైనాయి. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ పి.జగన్మోహనరావుచే ఆవిష్కరించబడిన హంసవాహిని సంకలనంలో వాడుక భాషకు తొలి జాడ గురజాడ, తెలుగుకు పట్టిన గొడుగు వెలుగులు పంచిన గిడుగు, వందనాల నూరవ 'తెరవే' అనే మూడు కవితలు ప్రచురితమైనాయి. తెలుగు రచయితల వేదిక అధ్యక్షులు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తి, అంబేద్కర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటా లీలావరప్రసాదరావు, సంస్థ వ్యవస్థాపకులు కోనే శ్రీధర్, సాహితీవేత్తలు వాండ్రంగి కొండలరావు, ఐ.పాపయ్య తదితరులచే తిరుమలరావు ఈ సంకలనాన్ని స్వీకరించారు.
హంసవాహినిలో తిరుమలరావు రచనలకు స్థానం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి