15.
మంచు కొండను డిగ్గి వచ్చెను మన్మథారిట గౌరితో
నంచమీదను పద్మగర్భుడు నర్గుదెంచెను వాణితో
నంచితంబగు హస్తి నెక్కిట నద్రిశత్రువు వచ్చెనో
మించు మూరితి! మీదు సన్నిధి మేలుకో ధరనేలుకో!
నిఘంటువు:
మన్మథారి= శివుడు
గౌరి=పార్వతి
అంచ= హంస
పద్మగర్భుడు=బ్రహ్మ
వాణి= సరస్వతి
అంచితము=అలంకరించబడినది
హస్తి=ఏనుగు (ఐరావతం)
అర్గుదెంచు= వచ్చు
అద్రిశత్రువు= ఇంద్రుడు
మించు మూరితి= ప్రకాశించే శరీరం కలవాడా!
16.
బారులై యిట నిల్చి యుండిరి భక్తులెల్లరుఁ బ్రీతితో
భీరులై యటఁ బారిపోయిరి పెంకెలందరు భీతితో
నేరుగా మిము చేరవచ్చిరి నిత్య సూరులు నేర్పుతో
మేరు ధీరుడ మిమ్ము చూడగా; మేలుకో ధరనేలుకో!
---------------------------------------------------
నిఘంటువు:
బారులు= వరుసలు
భీరులు= భయపడిన వారు
పెంకెలు= దుష్టులు
నిత్యసూరులు= ఆళ్వారులు
-----------------------------------------------------
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం
కరీంనగరం
9963991125
మేలుకొలుపులు(మత్తకోకిల)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి