ఈ రోజు జరిగిన సంఘటన
నాకు చాలాసంతోషాన్ని ఇచ్చింది!
నేను పుట్టి పెరిగింది పల్లెటూల్లొనె ,
పై చదువుల కోసం ఊరికి
దూరంగా ఉండవలసి వచ్చింది!
ఆ తరువాత పెళ్ళి .
పట్టణంలో ఉండవలసి వచ్చింది!
ఉదయం ఒక ఫోన్ వచ్చింది.
నేను గొంతుగుర్తుపట్టలేకపోయాను.
మా ఇంటిపక్కన ఉండే ఆవిడ,
వరుసకుఅమ్మమ్మ అవుతారు!
ఫోన్ చేసి -
యోగక్షేమాలు తెలుసు కున్నారు!
చాలా ఆప్యాయంగా
అరగంట సేపు మాట్లాడారు!
"మీ అమ్మ లేకుంటే ఏంటి
మా ఇంటికి వచ్చి
నాలుగు రోజులుఉండిపోవచ్చు గదా!"
అని చాలా ఆప్యాయంగాఆహ్వానించారు.
ఈ రోజుల్లో తోడబుట్టిన వారే
మనకు ఫోన్ కూడా చేయరు
వారి ఇండ్లకు రమ్మని ఆహ్వానించరు!
దీన్నిబట్టి ప్రేమలు
పల్లెటూళ్ళలోనే
పురుడుపోసుకున్నాయనే విషయం
మరోమారునిజమయ్యింది!
అవును.....
ప్రేమలు కనుమరుగవుతున్న తరుణంలో
ఇలాంటి వాళ్ళవల్లనే ఇంకా
ప్రేమలు బ్రతికున్నాయనిపిస్తుంది.
పల్లెటూళ్ళు కనుమరుగైతే
ఆ ప్రేమలుకూడా
కనుమరుగవుతాయేమోకదా!
చూడాలి మరి.......!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి