సహాయం విలువ:- మధు శ్రీ-ఎనిమిదవ తరగతి-వల్లాల ఆదర్శ పాఠశాల
 పూర్వం పెద్దయ్య అనే వ్యక్తి అడవిలో ఎండిన కట్టెలు కొట్టి   వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు, ఒ రోజు పై నుంచి గూడు కింద పడింది, అందులో చిన్న చిన్న పిచ్చుక పిల్లలూవున్నాయి, తల్లి పిచ్చుక బాధతో అరుస్తుంది, పెద్దయ్య వాటిని చూడగానే జాలి వేసింది, ఆ గూడును జాగ్రత్తగా మళ్ళీ చెట్టు మీద పెట్టాడు, తల్లి పిచ్చుక చాలా సంతోషించింది, అరుపులతోనే తన కృతజ్ఞతలు చెప్పంది, ఇలా కొన్ని రోజులు గాడిచాయ్  ఇంతలో వేసవికాలం రానే వచ్చింది, కాసిన్ని ఎండు కట్టెలు  కొట్టిన తరువాత అలసిపోయి పెద్దయ్య చెట్టు కింద నిద్రపోయాడు, ఇంతలో ఒక ఎలుగుబంటి అటుగా వచ్చింది,పిచ్చుక అరిచి పెద్దయ్యను నిద్ర లేపే ప్రయత్నం చేసింది, కానీ అప్పటికే అది చాలా దగ్గరకు వచ్చేసింది, ఈలోగా పెద్దయ్యకు మెలుకువ వచ్చింది కళ్ళు తెరవగానే ఎదురుగా ఎలుగుబంటి కనిపించడంతో భయపడి పోయాడు, అది అమాంతంగా దాడి చేయాలని చూసింది, అప్పుడే పిచ్చుక రయ్ మని దూసుకు వచ్చి ఎలుగుబంటి కంట్లో పొడిచింది, అది బాధతో విలవిలలాడింది, అదునుగా పెద్దయ్య  అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు, తనకు సాయం చేసిన పిచ్చుకకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పు కొన్నాడు, ఒకనాడు తన పిల్లలను కాపాడిన పెద్దయ్యను, ఇప్పుడు కాపాడినందుకు పిచ్చుక కూడా సంతోషించింది.

ఈ కథలోని నీతి: సహాయం చేసిన వారిని మరువరాదు

కామెంట్‌లు