సతీశ్ 9వ తరగతి చదువుతున్నాడు. చాలా పొట్టివాడు. ఆ తరగతిలోనే రాజేశ్ క్లాస్ ఫస్ట్ విద్యార్థి. కానీ వాడికి పొగరు ఎక్కువ. ప్రతి వారిలోనూ ఎదో ఒక లోపాన్ని వేలెత్తి చూపి, హేళన చేసేవాడు. సతీశును పొట్టివాడు అని రకరకాల ఉపమానాలు చెప్పి వెక్కిరించేవాడు. సతీశ్ ఇవేమీ పట్టించుకోకుండా తన చదువు తాను చదువుకునే వాడు.
ఒకరోజు తెలుగు ఉపాధ్యాయుడు "చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు" పద్యం చక్కగా అర్థం వివరిస్తూ చెప్పాడు. ఆ పద్యంలో "విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత" అర్థం వివరించాడు. అది విన్న దగ్గర నుంచి రాజేశ్ సతీశును "మర్రి విత్తనం, మర్రి విత్తనం అయ్యో మర్రి విత్తనంలా చాలా చిన్న" అని మరింత ఎక్కువగా హేళన చేస్తున్నాడు. సతీశ్ మనసులో నవ్వుకున్నాడు.
రాజేశ్ సతీశును హేళన చేస్తున్న విషయం తెలుగు ఉపాధ్యాయుని దృష్టికి వచ్చింది. తెలుగు ఉపాధ్యాయుడు ఆ తరగతి విద్యార్థులను అందరినీ చాలా పెద్ద మర్రి చెట్టు కిందకు తీసుకు వెళ్లాడు. "చూశారా పిల్లలూ! మర్రి విత్తనం ఆవగింజంత చిన్నగా ఉంటుంది. కానీ అంత చిన్న విత్తనం నుంచి ఎంత పెద్ద చెట్టు వచ్చిందో చూడండి. ఒక చిన్న విత్తనంలో ఎంత శక్తి దాగి ఉందో చూడండి. నేను పాఠము ఎంత వివరంగా చెప్పినా కొంతమంది మూర్ఖులు, తోటి విద్యార్థిని పొట్టిగా ఉన్నాడని మర్రి విత్తనం అని హేళన చేస్తున్నాడని తెలిసింది. మరి వాడు క్లాస్ ఫస్ట్ ఎలా వస్తున్నాడో అర్థం కావడం లేదు. పాఠాలు అర్థం చేసుకోకుండా బట్టీ పట్టి చదువుతున్నాడు అని అర్థం అయింది. క్లాస్ ఫస్ట్ రావడంతోనే బెస్ట్ స్టూడెంట్ కాడు. అందరితో స్నేహంగా ఉంటూ తోటి వారిని కూడా చదువులో ప్రోత్సహిస్తూ తనంత తెలివి గల వారిగా తోటి వారిని తీర్చి దిద్దేవాడు ఉత్తమ విద్యార్థి. ముందు పాఠాలు బట్టీ పట్టకుండా అర్థం చేసుకొని చదవాలి. రాజేశ్ సతీశును హేళన చేస్తున్న కొద్దీ సతీశ్ మర్రి విత్తనంతో తనను పోల్చినందుకు సతీశ్ పొంగిపోయాడు. రాజేశ్ తెలివి తక్కువ తనానికి సతీశ్ నవ్వుకున్నాడు." అన్నారు ఉపాధ్యాయులు. అందరూ నవ్వారు. రాజేశ్ సిగ్గుతో తల దించుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి