సంగారెడ్డి జిల్లా, కంది మండలం, ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నాడు జన్య ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన గణిత, విజ్ఞాన శాస్త్ర రంగోలి పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని హరివిల్లుల రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి, గణిత ఉపాధ్యాయురాలు రజిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు విజయ భాస్కర్, ఇతర ఉపాధ్యాయులు రవీందర్, చవాన్ సుభాన్ సింగ్, అడ్డాడ శ్రీనివాసరావు, సంధ్య పాల్గొన్నారు. మొదటి బహుమతి ఆరవ తరగతికి చెందిన ఖుషి, భవాని, లత పొందారు.
విద్యార్థుల రంగవల్లులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి