వేదవ్యాసుడు :- కొప్పరపు తాయారు

  ఒకసారి వ్యాసులవారు గోపాలకులు గోపికలు సకల గోకులం గూర్చి‌ బాధ పడ్డారు.దుర్భరులు, మూర్ఖులు,అని దానిని పోల్చారు .
            ఆకాశంలో చంద్రుడు _పౌర్ణమి నాటి చంద్రునకు,చేపకు పోలిక తెలిపారు . ఎందుకంటే చంద్రుడు ఆకాశంలో, చేపలు నీటిలో రెండిటికి ఏ రకమైన సంబంధం లేదు. 
         ఆకాశంలో ఉన్న పూర్ణ చంద్రుడు అలల కదలికల వల్ల ఆ చంద్రబింబం ఒకసారి పొడవుగా ఒకసారి, ఒకసారి వెడల్పుగా కనిపిస్తూ ఉంటుంది. 
రకరకాల ప్రతిబింబాలు ఏర్పడుతూ ఉంటాయి. 
           వాటి పైన చేపలు కూడా అంతే వేగంతో సంచరిస్తూ ఉంటాయి. కానీ విషయపరిజ్ఞానం ఉండదు.చేపలుగ్రహించలేకపోవడం వాటి మూర్ఖత్వం, జడత్వమే కదా! 
             అదేవిధంగా గోకులం లోని పరిజనం కృష్ణనుని గొప్పతనాన్ని తెలుసుకోలేని స్థితిని
తలుచుకొని బాధపడ్డారు. వారితో ఉన్నది పరమాత్ముడని  తెలియని అమాయకత్వపు మూర్ఖపు ఆలోచనలకి బాధపడక తప్పదు.అని 
               ****
కామెంట్‌లు