సుప్రభాత కవిత : - బృంద
తూరుపు వీణకు 
గగనమే వేదిక కాగా 
కిరణపు తీగల రాగానికి 
సాగరమే సంగీతం

అలల గలగలలన్ని 
సంగీత స్వరాలే 
కెరటాల పరుగులన్నీ 
సాహిత్య మధురిమలే!

ఉదయించే భానుని చూసి 
ఉప్పొంగే కడలి సంతోషం 
ఉరుకుల పరుగుల 
ఊయలలూగే అలలదే!

హృదయం మురిసే 
ఈ క్షణాలను అనుదినము 
ఆస్వాదించి ఆనందించే 
చెరగని సాక్ష్యం శిలలదే!

దూరాన వెలిగే తూరుపు దీపం 
తీరాన నిలిచి చూసే భాగ్యం 
తీరేనా కోరిన అందరికీ 
తెలిసేనా రోజూ చూసేవారికి!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు