*ప్రయత్నిస్తే విజయం*:- మీర్జా సఫూర -10వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల -జిల్లా సిద్దిపేట.-8897869171.
 రాముకు చదవంటే చాలా ఇష్టం.కానీ ఎంత చదివిన అర్థమయ్యేది కాదు.తనుఅందరిలాగ చదువలేక పోయేవాడు.ఇది చూసి తన మిత్రులందరు చిన్నచూపు చూసేవారు. ఉపాధ్యాయులు కూడా నీకు ఏమి రాదు ప్రయత్నించవు అని కోప్పడేవారు.తనకు ఏమాత్రం ఇదంతా నచ్చేది కాదు.ఇలా అందరు తిడుతున్నారని ఒక గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాడు.
నాకు చదువు ఎందుకు అర్థమైతలేదో అంతుపట్టడంలేదు.
బట్టి విక్రమార్కుడిలా ప్రయత్నిస్తాననుకున్నాడు. అకస్మాత్తుగా తన చూపు సాలెపురుగు గూడుపై పడింది. ఆ సాలె పురుగు గూడు కడుతుండగా పైనుంచి కింద పడగానే గూడంతా చెడిపోయింది.మళ్లీ పైకెళ్ళింది. మళ్లీ కింద పడ్డది.ఎన్నిసార్లు కింద పడ్డ అన్నిసార్లు అంతకంటే వేగంతో పైకెళ్ళి తన గూడును నిర్మించుకో సాగింది.చివరికి గూడు నిర్మాణమైంది.అందులో తను జీవించసాగింది.సాలె పురుగును తదేక దృష్టితో చూస్తూ తన గూటి కోసం ఎన్ని కష్టాలు పడిందో అర్థం చేసుకున్నాడు.
రాము అప్పటినుంచి నేను కూడా మళ్లీమళ్లీ ప్రయత్నిస్తాను.చదువు నేర్చుకుంటాను అని పట్టుదల అతనిలో మొదలైంది.
చివరికి సార్లు చెప్పిన పాఠాలు జాగ్రత్తగా నేర్చుకుంటూ అర్థం కాకపోతే మళ్లీ మళ్లీ అడుగుతూ నేర్చుకో సాగాడు. చివరికి విజయం తనను వరించింది.ఓటమి అనేది విజయానికి తొలిమెట్టని తెలుసుకొని ముందుకెళ్లాడు.
ఆ విధంగా అనుకున్నది సాధించాడు.ఎవరు చదువురాదని బాధపడకూడదు.ప్రయత్నంమానవలక్షణం కావాలి.



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Pratniste sadinchanidi edi lesu. Very nice beta
అజ్ఞాత చెప్పారు…
BAKRICHEPYALA ku spurti safoora ma pillalaku thana friends ki inspiration safoora pattudala parents inspiration thanaku thodu All the best safoora