ఊరుగాలి ఈల 104:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మెరుపులు లేని ఆకాశం ఉరిమే వాన పల్లె నీదేలే
కలుపులేని పొలం నేలంతా పచ్చనిసిరి ఊరు నేనే
తలుగుతీసిన ఎద్దు ఊరంత కుమ్మ పల్లె కొమ్మేదిగ

పొలాలన్నీ హలాలదున్నే రైతు ఊరు ఘర్మజలం
పురుడులో పాపకేక ఆర్కుడి వేడి ఊరు  ఎండలే
పప్పుబియ్యం పప్పుబెల్లం పడిన తీరే ఊరుబాథ

ఎవరినీ ఏమనకు నమ్ము ఊరోడు నమ్మకుదొంగైన
ఊరువాసన ఊరుకేతెల్సు పరాయి బెల్లంకొట్టేదే
ఊరు నాకు చాలా ఇచ్చే నేర్పే పాటే గుండెగొంతు

ధరల గొడవల్లేవు గింజమ్మేది అడ్తిల వచ్చిందే బస్
కళ్ళాలకొచ్చే వ్యాపారిబేరమాడ పాయేగా ధాన్యం
కష్షం పల్లేది ఆటనాది పాటనీది వారీ ఆపుపరుగు

బురదల దిగంది రాదు బంగారం చేతికి ఊరందం
అమ్మనే మరిచేనటన వాని ఊరుమాటే అక్కెరపో
చెప్పుల్లేని నడక రోడ్డులేని తొవ్వ పల్లె మూలమదే

ఊరుదాటాక కల్చర్ కొత్త వల్చర్ నోరేనా బువ్వకు
బాధ ఎదదాటి రాదు ఊరు సీత పీతల చిక్కదది
తలెత్తిన బలం ఊరు దించు పొగరు అత్తరువేషం

ఈలపీట తెగింది కన్నీళ్లనది వంటిల్లే నవ్వే పల్లె సీ
జుట్టుకు సమరు జట్టుకు పవరు రుద్దు పల్లెమెరిసే
నాది రాత మీది తిరగమాత రుచిపల్లె భలేఈలపో

=====================================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు