ఊరుగాలి ఈల 105:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
పరుగాపక సాగే బతుకు ఊరు పాశం నను వీడలే
ఆమెనవ్వే నా నడక వడివేడి పల్లెముల్లె చెలిసిరీ
మనసుచెప్పదు మాటఅనదు ఊరోన్ని కళ్ళవొత్తే

ఎన్ని కడగండ్లు వడగండ్లు బాధలు చూసేనో ఊరు
ఆకూవేర్లే మందుల చికిత్సప్రకృతి రక్షణే పల్లె జీవి
అన్నీ బాగే అమ్మ చలువ ఊరు నిలువ గొప్ప నేనే

అబద్ధం అందం నింగిహరివిల్లులే కాదు పల్లెముగ్గు
మూకీ సినిమా ఊరు కదిలే రంగులకై  పాటసాకీ
నిజంచెప్పనా ఊరూనేను అనాథ కాదు ఓజీవకళ

గోలగోల ఊరులీల కొత్త నన్ను పిలిచే పాటపాతదే
గింజ భూమిని గింజుకొన్న మొక్క పెరిగే పల్లెనీడగ
ఆపదూవోపద పల్లె వాన రాదూపోదు ఆగం నేనేగ

దారిలేని నడకలెన్నో నేర్పేపల్లె కందిన పాదాలే రక్ష
మన్నేగా ఊరుబతుకు బుక్కినా పీల్చినా కాచే
అమ్మంది మట్లె ఆడొద్దని ఊరే మట్టి మరి ఆటెలా!

ఎగిర్తపడదు ఊరు కలహంస నొత్తురోడే పాదాలు
ఊపిరిలో నన్నే రెక్కలకింద కమ్మే పల్లె గుడ్డెట్టే పెట్ట
దొరకదు అయ్యకు కోడి ఊరు చుట్టె బతుకు గింజై

అసూయ ముందు ఆపై వాడు పుట్టే పల్లెకాదేలొల్లి
మేనమామ చెప్పే నా సంగతి ఊరంటే అమ్మనీడే
చలిఎండవాన స్నానం బావికే వెచ్చని ఎడదపల్లె

==============================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు