ప్రేమలేకలే నడిచే నింగీనేల మబ్బుల జబ్బు ఊర్ల
అనంతగీతి ఆనందం ఊరంతా నింగి మబ్బులాట
పరువు చెరువుగట్టు ప్రేమగుండె ఊరు నే కాపలా
నమ్మంగానీ కొన్ని కలలా ఇంకొన్ని కళ పల్లెపాటలా
ఉబ్బరం లేదు ఉబ్బసం నో పల్లె గడుసు ప్రేమనెగ్గు
మిడిసిపడకు నేను సన్నాసి ఊరుజూపు నీమనసే
మల్లెలు వీచే మనసుదోచే వంక పైన నెలవంక సీ
ఆమని కురిసే జాబిలి తడిసే పల్లె ఎద పరవశించే
వండేవాడే నిపుణ అన్నం ఉడికించ పల్లె తినదుర
జానలున్నదే పల్లే హూందాగ బతికే హిమశిఖరం
చెమట మీటే వీణలు మా ఊర్లతీగలన్నీ రాగలేబ్రో
ఆమెను కదుపకు నిద్రల కుదిపేసే మౌనం పల్లెలో
శబ్దంలేదనుకోకు నివురుగప్పిన నిప్పు పల్లెకంజీర
అడివికి పా పులుంది భయమా ఊర్లనేనే సింహం
కాదూ కూడదనకు తలూపు ఆకుల్లానైస్ పల్లేగుడ్
జన్మకో శివరాత్రి బి గుడ్ డూ గుడ్ పల్లె ఫిలాసఫీ
చేసిచూస్తే అది ఊరు నాస్టాల్జియా రేపటి పాపకు
మాతాత వదిలే ఊరు నాన్ననేను నడిచే పాపలం
బడిమడి దూరం నాకు అమ్మవొడి దెగ్గర ఊర్లది
జాత్ర యాత్ర నడిచే ఊరంతాఆడే ఆనందోబ్రహ్మనే
ఆకలికి అమ్మ ఆటకు గల్లీ నిద్రకు పల్లె నా భాగ్యం
====================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి