ఊరుగాలి ఈల 108:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఎవరని కోపం ఊరు నా ముఖం దాచిన తోటేకదా
పిడకకు పేడ దుర్వాసనకాదు శ్రీగంధమేలే పల్లెఫైర్
అందం కొలిచేదేదీ లేదు మాయకాదే పిడస పల్లెల

తలబిరుసేలేదు జారుజడ కోపదీపం ఊరునగలే
తీపిచాలు జిగినిచ్చే గంజిమేలు ఊరు అజేయుడే
గెలువనిచోట గెలుపు పలికే పిలుపు రైతు నేరౌతు

కాస్తుజేసే దర్కాసు పల్లెదే మట్టి దున్నే నాగలి నేనే
ఊదరగొట్టే ఉద్దెరమాట చెల్లనికాసే దేఖో పల్లెవృద్ధి
తాగనిచోమత్తు తాగినచిత్తు దరిచేజేర పల్లే జీవం

దస్తూరి ఊరిది కలంపట్టే వేళ్ళు నేనే లిపి వాక్యమే
కలఫలితం కళట! కలతలేని వ్యధ ఉంటే ఊరదేసీ
చేతులు లేత ఓపవు వాత ఊరదే బంతీపూబంతి

మసిలే నీళ్ళ ఉడికే బియ్యం ఓపికే ఊరు అన్నం
కాలేకడుపు ముసిముసి చూసేకన్నే పిసపిస పల్లె
ఆడ తలపోటే తల ఉంటేగా బాధ!నసిగే నేఊరు

అరుపుమరుపే కురిసేవానకు అదుపు ఆజ్ఞే ఊరు
ఊరకరారు పెద్దలు దోచేగద్దలు దాచుకో ఊరుసిరి
కంకరేస్తే కూజానీరు పైకే మరేమేస్తే నేపైకి పల్లేచెల్లే

మనిషి మరిచే ఊరు గోద పసిగట్టేగా మట్టివాసన
తినడంకాదు అరిగించుకో నొవ్వ పల్లె దవాఖానే
బలమని మిడువకు ఏదీ నీదికాదు పల్లెసిరినీదిగా
==============================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు