ఊరుగాలి ఈల 111:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఎలా తీరు నా ఋణం ఊరుపెంచిన బతుకుజన్మ
ఆశలెన్ని జూపినా మరువలే నన్నే పల్లె సిరి మట్టి
ఆగి నిను మరువలేను ఆపి మనలేనే ఈలఊరే

వనసీమ వినె ఈల పల్లెనోట మొలక సూరి మీటా
విసుగులేక ముసినవ్వు వికాసమే పాఠకమిత్రనేత్ర
స్పందన లీలగా ఈలనే పిలిచే ఊరునవ్వు నడకై

మనసు లోతు మైదానమే సిరిగిరి ఊరు ఎద కథ
మిత్రులే చదువ ఘనఈల ఊరులీల తేలే శ్రావ్యత
మంచిమాట నేర్పె మనసుతో ఊరూగే ఈల పదా

ఆనదాటలే కోనదాటలే ఊరుబతుకు గీత చెప్పెగా
చెప్పలేని నడక చెప్పులేలేక తొవ్వ మొరము రాసే
మాటరాదిక మనసుబాధ ఊరులీలచెప్ప ఈలలేక

కుట్రలేనిమట్టి పుట్రలేక గట్టిపల్లె పులి వాతేలేక సీ
మాటాబాటా చెప్పే ఊరు నడకనడత మదిగొప్ప
ఎవరేమన్నా ఊరేనింగి మనిషి టైంజూసే నోరురా

ఆమె పునీత కవితగీత కథలరాణి ఊరుచేరేగూడే
కొండలు బండలు పాడే ఈలపాట పల్లె వీచేతోట
అందం కనపడని కళ పిల్లపల్లే వొదిగే కట్టూబొట్టు

ఎదిగిన ఒదిగిన సిరి ఊరు తల్లివేరు మమత గీత
బరువు మోసేబండలే పరువు పూసే పూలే ఊరిదె
సంగమం చౌరస్తా పాదాలు సంగీతతీపి  పల్లెపదం
================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు