ఊరుగాలి ఈల 112:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఎవరు పిలిచినా పులకింతే ఎదల ఊరే తన్మయం
నరుని నడకల ఊరు చెడుచూపే గాలి దేలిఊగేగా
కలల వానల తడిసే ప్రకృతిసీమ ఊరే కంటికన్నేగా

ఆనమీరని చేనెంట కదిలే సొగసుకాంత చెమటదే
నింగితారకాదు కంటిచుక్క నా ఊరే సజీవ శిల్పం
ఎన్నికలాలు చదివిన కలో పల్లెకథ పిల్లలాడేసీమ

ఆవుకథ ఎన్నిసార్లవిన్నా కొత్తే ఆవురావురు పల్లె
తప్పిపోయిన ఊరు చేయ్యికి తగిలే పాతాళగరిగ
అంతా వినికూడా చెప్పదు మనసు ఊరు కొండని

మనిషిసాఫ్ మాటసాఫ్ పల్లెదారిసాఫ్ పనివంకే నో
నవ్వితే ఊరుయాదే కోపాన పల్లెఎద తడీవేడి సడి
జున్నుగిన్నె ఊరు అన్నులమిన్న ఆగంకాదుకానీదే

బడిలేదే నేడు సెలవ్ ఊరు వాకిలి గిలకొట్టే వెన్న
అమ్మవొడి సేదదీరే ఇల్లు ఊరు రాసిన పనిపన్నీరు
కళలన్నీ వృత్తులవొత్తులే పనిలో పల్లె కలలపంటే

చివర మొదలులేనిది మట్టి కదిలే మనిషి ఊరట
అనువు అనుకువ కువకువరాగం పల్లెఅల సంద్రం
నింగీనేల వెలుగు ఊరు నన్ను పెంచే దయామయి

రికాంలేకసముద్రం ఊరుఫరాక్ మనిషిప్లే మురిసే
పురుసత్ లేదట ముసాఫిర్ గేట్వే ఊరు కదిలేగీత
మనసు పారేసుకునుడే ఎవరైనాచూస్తే ఊరుఎద

==============================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు