సాహసం నాలో ఊరేగదా ఊపిరి పల్లె నా దారెంట
కసువుండదు అంతాప్రేమే దాగనిపల్లె గిల్లిదండ ప్లే
ఆమె నా అద్దం మనసు అందం ఊరు ఈలగది నే
పనిపాట ఊరునగ సిగపూలు అందంసీ జారుజడ
పిల్లిలేవని పొయ్యి మెతుకులేని కడుపు ఊరెండే
ఆకలేయదు దూపలేదు ప్రేమమనసు తీగలు పల్లే
నోరూరే గడపల నేనే ఊరంతా పూలతల నిగనిగ
తీపి ఇంకెక్కడ ఊరుకన్నా ఏడ్వకుకన్నా రుచిదేగ
తరగలెగిరే గాలికెరటాల తీరంచేరే ఈల కళేపల్లెరా
విల్లూనే అమ్ములే బాణం చిరుపాటే చిగురాకుపల్లె
ఇందాక చూస్తే నువ్వెవరనే ప్రశ్న ఊరనే సోయిలేక
బాధ్యతమీది బాధనాది ఊరుబోధ పద ఆటఇల్లే
అడివిపల్లె నీడ గుడిసే కదిలే ఊరది ప్రవాహమే
అన్నిపూలు పూసే తురిమే సిగ ఊరు ప్రకృతికొస
కట్టెలుకొట్టే గొడ్డలి కామనే ముద్దాడే పల్లె చేతెట్టి
జొన్నకంకి తలకునగ సొగసు పల్లె కైదండ ఎగిరే
మీరింత జెప్పిన ఊరూవాడ తొడగొట్టే బరి ఆడే
సొంతంనీకే గాలి అంతానీదే ఊరాట చెలినెమలి
చౌరస్తాలోనేను నలుగురికై పల్లె సంచారి నేనే పది
బోడుగుట్ట తొవ్వచెట్టు నీడలే ఊరు నడకే వరిసిరి
ఎండల ఊరు తోడే చెమట చెలిమె దళారిలేక గ్రేట్
===============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి