ఈల ఆగదు పల్లెపాట బతుకే మనిషి బృందావని
ఎన్ని మలుపులుదిప్పెనో లోయ ఉరవడీ లయలో
ముప్పులేని గొప్పమట్టి నిప్పునిప్పనే పల్లెచరితలే
ఏడేడులోకాల ఊరొక్కఊరే వేమనపోతన నడకై
ఋజువర్తన నిజవర్తన పాలుదాగే తాటివనంపల్లే
వాదమేదైనా ఊరు ఈల తీపిమాటేపల్లె మాబాట
మూడునెలల ఈల చెవుల మోగే పాటనేర్చే ఊరే
ఇష్టపడి వినిరి జనులు ఊరు పొడుగు పాటనేసిరి
కష్టపడి రాసిన కలమే ప్రేమపెంచే కవిగాదు మనిషి
థాంక్స్,డా.ముఖేశ్ రావు కెఎల్వీప్రసాద్ సుశాంత్,
డా.సురేష్ రెడ్డి ప్రవీణ్ నరహరిడింగరి చదివేప్రీతి,
ఆనంద్,ఎర్రోజు,వఝ్ఝల,దేవేందర్లెగన ఈలధన్యం
మొలక పాదులేసి పూలుపూసే ఈల సూరినాధ,
ఇంక బుధుమిత్ర పరివారమేగనే ఈల ఊరు లీల
కోనేరుతడి లేదు తేరెక్కివేసే ఈల నే ముసి ముసి
ఈల అనే ఊరులీల దీర్ఘకావ్యం ఊరేగె ఎదలనేనై
కడలి కెరటాల ఈదే ఊరుశ్రమ నే పాడినదే గీతం
కృతివెలిగే కృషిని భాష అభివ్యక్తి పల్లే భావోద్వేగం
అభినందనలు మిత్రులారా ఈలేసి మీకై ఊరంపే
ఆశతో ఆప్యాయత చేతుల నా ఈల అక్షరాంజలి
కాలం లేటెస్ట్ టెస్ట్ ఊరుప్రేమే ఎవర్ బెస్ట్ నమస్తే
=======================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి