నెలవారి కాలిఫోర్నియా వీక్షణం 150వ అంతర్జాల సమావేశంలోశనివారం సుప్రసిద్ధ కవి, విమర్శకులు శ్రీ నాళేశ్వరం శంకరం గారు 150 మంది కవుల 150 కవితల ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రత్యేక సంచిక అద్భుతంగా ఉన్నదని, కవితలు చాలా గొప్పగా ఉన్నవని ప్రశంచించారు. 150 కవులలో 53 మంది మహిళలు ఉండటం, 42 మంది కవులు అపార అనుభవము ప్రతిభ ఉన్న కవులు ఉండటం గర్వించదగ్గ విషయమని చెప్పారు. వీక్షణం స్థాపించి 12 సంవత్సరాల నుండి అప్రతిహతంగా సాగుతున్నదని, అందుకు సహకరించిన కవులకు ధన్యవాదాలు తెలిపారు. వీక్షణం భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ అతిధులకు, కవులకు స్వాగతం పలికి, సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
పిమ్మట కవి, రచయిత, వ్యాసకర్త, ఉపన్యాసకుడు, వ్యాఖ్యాత, నటుడు, దర్శకుడు డాక్టర్ కె.జి.వేణు గారు పుస్తకంలోని పెక్కు కవితలపై చక్కని సమీక్ష చేసి అందరిని అలరించారు. వివిధ కవుల కవితలను చదివి, విశ్లేషించి శ్రోతలను ఆకట్టుకున్నారు. డాక్టర్ వేణు గారి ప్రసంగం నదీ ప్రవాహంలాగా, జలపాతంలాగా అరగంటపై సాగింది.
ఈ సమావేశంలో అమెరికా కవులు భిల్లా శ్రీధరరెడ్డి, ఆదిత్య మోపిదేవి, శ్రీనివాస్ చింతా, మృత్యుంజయుడు, వెంకట్ కొత్తూర్ గీతా మాధవి గారు చేస్తున్న సాహిత్యకృషిని అభినందించారు. భారతీయ కవులు కందుకూరి శ్రీరాములు, మౌనశ్రీ మల్లిక్, వసీరా, రామాయణం ప్రసాదరావు, గంటా మనోహర్ రెడ్డి, అయ్యల సోమయాజులప్రసాద్, ఆకుల మల్లేశ్వరరావు, రాధా కుసుమ, మల్యాల మనోహరరావు, యు.వెంకటరత్నం, డాక్టర్ ఎం.ఎన్.బృంద, పరాంకుశం క్రిష్ణవేణి, రామక్రిష్ణ చంద్రమౌళి, డాక్టర్ సమ్మెట విజయ, డాక్తర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, సుబ్రహ్మణ్యం, భోగెల ఉమామహేశ్వరరావు, మేడిసెట్టి యోగేశ్వరరావు వీక్షణంచేస్తున్న సాహిత్య సేవలను కొనియాడుతూ కొందరు కవితలను వినిపిస్తూ సభకు హుందతనం ఇచ్చారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మభాష అమృతం, మాతృభాష మరందం అంటు మాతృభాష ముచ్చట్లు చెప్పారు. చివరిగా డాక్టర్ గీతా మాధవి అతిధులకు, కవులకు ధన్యవాదాలు తెలిపి సమావేశాన్ని ముగించారు.
చక్కని సమవేశం ఏర్పాటుచేసినందుకు కవులు సంతోషం వ్యక్తపరిచారు. ఇకపై నెలనెలా తప్పకుండా వీక్షణం సమావేశాలలో పాల్గొంటామని వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి