నువ్వు...కో...అంటే
కోటిమంది నీ ముందు నిలుస్తారు !
ఆ ..వెన్నెల వెలుగులో
నేను నీకొక చీకటి రేఖను ...!!
----------------------------------------------9
అధరాలను
అందంగా తీర్చుకుంటావు !
అదుపులోపెట్టిన అందాలకు
అలంకరణతో పనిఏమి.....!?
------------------------------------------------10
నీగురించి తెలియనివాళ్ళు
నిన్నుచూచి ....అప్పుడే
ఆకాశంనుండి దిగివచ్చిన
అప్సరస అనుకుంటారు ...!
------------------------------------------------11
ఇప్పటి నీసౌందర్యం చూసి
నిన్నటి నీ యవ్వనపు నిగనిగలు
అంచనావేయగలను....!
కరిగిపోయిన కాలాన్ని లెక్కగట్టగలను!!
----------------------------------------------------12
వయసు పెరిగితేనేమి....
నీ మనసు మయూరమై
నాట్యం చేస్తున్నది....!
అతివలనుసైతంఆకర్షిస్తున్నది..!!
-------------------------------------------------------13
నీ విందుతోనే ....
నీపొందు పొందినంత ఆనందం!
పొందుఅందితే చెప్పేదేముంది ,
స్వర్గానికి చేరువైనంత కదా....!!
---------------------------------------------------------14
కొసరికొసరి వడ్డించే
నీ అమృత హస్తంలోనే ...
మహాత్తుఏదో ఉంది ....!
ముద్దుమీద ముద్దు పెట్టినట్టు !!
-----------------------------------------------------------15
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి