నవ్వుతూ బ్రతకాలిరా - 25:- సి.హెచ్.ప్రతాప్

 1. డభై ఏళ్ళ వెంకట్రామయ్య రోడ్డుపై నడిచి వెళ్తుండగా పక్కనే ఒక కారు వచ్చి ఆగింది.
" అంకుల్ లిఫ్ట్ కావాలా ?" అని అడిగాడు డ్రైవింగ్ సిట్లో కూర్చున్న వ్యక్తి.
" అఖ్ఖర్లేదు నాయనా ! మేము గ్రౌండ్ ఫ్లోర్ లోనే వుంటాము" తాపీగా చెప్పి వెళిపోయాడు వెంకట్రామయ్య.
2. " ఎందుకురా రాజు స్కూలుకు లేటుగా వచ్చావు? రూళ్ళ కర్ర చూపిస్తూ కోపంగా అడిగింది టీచర్.
" మన స్కూలుకు వచ్చే రోడ్డుపై ఒక కొత్త బోర్డు పెట్టారు, అందుకే లేటయ్యింది టీచర్" అన్నాడు రాజు.
" ఏం రాసుంది అందులో?"ఆశ్చర్యంగా అడిగింది టీచర్.
" గో స్లో" చెప్పాడు రాజు.
3. "న్యూస్ పేపరును ఫ్రిజ్ లో ఎందుకు పెట్టావు?" ఆశ్చర్యంగా అడిగింది రాధిక.
" ఈ పేపరు నిండా హాట్ న్యూస్ లే వున్నాయని ఇందాక డాడి అన్నారు. అందుకే చల్లబరచుదామని ఫ్రిజ్ లో పెట్టాను" గొప్పగా చెప్పాడు ఆరేళ్ళ చింటూ.    
4. ."ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తూ లెఖ్ఖలు వేస్తున్నారు ?"అడిగింది ఆండాళ్ళు కొత్తగా మంత్రి అయిన భర్తతో.
" వచ్చే అయిదేళ్ళ కాలంలో ఎంత సంపాదించాలి, అవి ఎవరెవరి పేరు మీద రాయాలి అన్న లెఖ్ఖలను ముందుగానే వేసుకుంటున్నాను" అసలు సంగతి చెప్పారు మంత్రివర్యులు.   
కామెంట్‌లు