నీనవ్వుతో
నేను పోటీపడలేను !
నాముఖంలో నవ్వును
నువ్వీజన్మకుచూడలేవేమో!!
--------------------------------------16
సమూహంలోనాజాడ
నీకెప్పుడూ యిబ్బందే..!
నువ్వూ-నేను ఉన్నప్పుడు
మనిద్దరికీ అదినవలోకమే!!
----------------------------------------17
కల్మషంలేకుండా ....నువ్వు ,
మనిషిని ఇట్టే నమ్మేస్తావు ....!
నీ బ్రతుకుజాడలన్నీ ...
మనసువిప్పి కుప్పపోసేస్తావు !!
------------------------------------------18
నీకు తెలీకుండానే ..నువ్వు
ఎంతటివారినైనా ,
ఆశలముగ్గులోకి దింపేస్తావు !
చివరకు మిగిలేది మాత్రం నిరాశే!!
----------------------------------------------19
నాలుగుతరాలకు ప్రతినిధివి !
తరతరానికీ మధ్య అంతరాల
అవగాహనలో .....
నీకునువ్వేసాటి ........!!
-------------------------------------------------20
కుటుంబంలో అందరి బాధ నీదే,
అందరి సుఖానికీఆధారం నువ్వే!
నీ కష్టసుఖాలు కనిపెట్టుకునే....
నాధుడెవరంటేమాత్రంప్రశ్నార్ధకమే!!
----------------------------------------------------21
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి