ఘనంగా జాసాప 38వ వార్షికోత్సవం

  నేడు సమాజానికి సంస్కృతి, సాంప్రదాయ రచనలు ఎంతో అవసరమని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వడ్లూరి ఆంజనేయరాజు అన్నారు. సరస్వతి శిశుమందిర్ ఆదివారం సిద్దిపేటలో జరిగిన జాసాప వార్షికోత్సవంలో మాట్లాడుతూ యువ కవులు సాహిత్య రచనలు చేయడంలో ముందుకు రావాలన్నారు. సాహిత్యం ద్వారా సమాజంలోని రుగ్మతలు తొలగించవచ్చన్నారు. జాసాప రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజూల రవీందర్ మాట్లాడుతూ ప్రతి రచయిత రచనలు జనుల హృదయాలలో చోటు చేసుకునేలా ఉండాలంటూ, దేశం జాగృతమయ్యేలా సాహిత్యం ముందుకు సాగాలన్నారు. మన చరిత్రను మనం కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. ధర్మ రక్షణార్థమై రచనలు చేయాలన్నారు. వార్షికోత్సవం సందర్భంగా తడకమడ్ల సాంప్రదాయ సాహితీ పురస్కారం - అవధాని అవుసుల భానుప్రకాష్ ( మేడ్చల్)కు, ఐతా భారతి చంద్రయ్య సాంప్రదాయ  కథా పురస్కారం - కూర చిదంబరం (హైదరాబాద్) కు, ఎన్నవెళ్లి బాలసాహిత్య పురస్కారం - గరిపల్లి అశోక్ (సిద్దిపేట) లకు నగదు, ప్రశంసాపత్రాలతో అందజేశారు. ఐతా చంద్రయ్య రచించిన వెన్నెల గువ్వలు బాలల కథలు పుస్తకావిష్కరణ జరిగింది. జాసాప గౌరవ అధ్యక్షులు ఐతా చంద్రయ్య జాసాప సిద్దిపేట అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం కవులు వరుకోలు లక్ష్మయ్య, పప్పుల రాజిరెడ్డి, డాక్టర్ మహేందర్ రెడ్డి, బస్వ రాజ్ కుమార్, కెవైగిరి, కోణం పర్శరాములు, దాసరి రాజు, అనిశెట్టి సతీష్ కుమార్, చీకోటి రాములు, బాలచంద్రం, ఉండ్రాళ్ళ తిరుపతి శాడ వీరారెడ్డి, గైని శ్రీనివాస్, గుండ్ల రాజు, పెందోట వెంకటేశ్వర్లు, పిన్నింటి మహేంద్రారెడ్డి, వైరాగ్యం ప్రభాకర్, మిట్టపల్లి పర్శరాములు, డబ్బికార్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు