అప్పుడేప్రేమగా
అనందంగామాట్లాడతావ్ ....!
మాటలుపెరిగేకొద్దీ ఏమిటోగాని
దూరంగ నెట్టినట్టు ప్రవర్తిస్తావ్ !!
------------------------------------------22
ఒక్కోసారి నీప్రవర్తనకు
నాహృదయం పచ్చిగా
గాయపడుతుంటుంది !
అదేమనచివరి కలయిక అనిపిస్తున్ది!!
--------------------------------------------------23
మూగబోయిన నామనసును
ఇట్టే గుర్తు పట్టేస్తావు....!
ఊహించనంత వేగంగా
మాటల అమృతం కురిపిస్తావు.!!
---------------------------------------------------24
నిన్నుచూస్తూంటేనే ...
నామనసులోఏదో చెప్పలేని కదలిక !
నీ స్పర్షకోసం అంతులేనిఆరాటం...
నాస్వార్ధానికి నీస్పీడ్ బ్రేకర్ అటెన్షన్లో ఉంటుంది !!
-------------------------------------------------------------25
నిన్నునువ్వు కాపాడుకోవడంలో
నీకుసరిలేరు ఎవ్వరూ ....!
కవ్విస్తూనే ఉంటావు
అవసరానికి కఠినంగామారతావు....!!
---------------------------------------------------26
గతాన్ని గుర్తు పెట్టుకుని
గడుసరిగా మారవు.....!
ఏమీ జరగనట్టే తిరిగి
అనురాగసముద్రంలోముంచేస్తావు !!
-----------------------------------------------------27
ఎగసిపడెకెరటంలా
ప్రేమనుపంచి ..అప్పడప్పుడూ
వెనక్కుజారిన అలలా ....
తికమక చేస్తావెందుకో .....!!
----------------------------------------------------28
ఆహార్యంతో .....నువ్వు
అందాలను అదుపుచేయడంలోనూ
ఆకర్షణలను విరజిమ్మడంలోనూ....
అవార్డుకుఅర్హురాలివి సుమా.....!!
-------------------------------------------------------29
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి