మోసకారిరంగయ్య:- అందె రక్షణ-7వ, తరగతి--జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల -సిద్దిపేట జిల్లా -9704865816.
 చిన్నప్పటినుండి శంకరయ్యకు వ్యవసాయం అంటేచాలాఇష్టం.
భూమిదున్ని పంటలు పండించేవాడు.
కొన్ని సంవత్సరాలు వర్షాలు పడక పంటలు ఎండిపోవడం జరిగింది.కరువు కాటకాలు ఏర్పడ్డాయి.బోరుబావిలో నీరు లేక పంటలు పండడంలేదు.
కుటుంబాన్ని ఎలా పోషించేదని బాధపడుతుండేవాడు.
కూతురు నాన్న బాధను అర్థం చేసుకొన్నది.ఆమె  వ్యవసాయం గురించి సార్లు పాఠం చెప్పేటప్పుడు బాగా వింటుండేది.
ఎప్పుడైనా కరువు కాటకాలు ఏర్పడినప్పుడు వరి పంట కాకుండా ఇతర కూరగాయపంటలు.
పూల పంటలు వేసి తక్కువ నీటిని పొదుపు చేసుకొని లాభాలు పొందవచ్చని సార్లు చెప్పగా విన్నది. 
అవే మాటలు వాళ్ళ నాన్నకు చెబుతుంది.నా కూతురు చెప్పినట్లే చేస్తా అని శంకరయ్య అనుకుంటాడు.
తన రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం బంతి తోట,
అర ఎకరం టమాట తోట పెట్టాడు.నాలుగు నెలల వచ్చేసరికి బంతి తోట పసుపు రంగుతో నిండిపోయింది. టమాట తోట పొద్దున ఉదయించే సూర్యుడిలాగా ఎర్రగా నిగనిగలాడుతుంది. శంకరయ్య కళ్ళల్లో ఆనందం కలిగింది.నా కూతురి సలహాకు మనసులో ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు.
బంతిపూలు సంచుల్లో, టమాటాలు గంపల్లో నింపుకొన్నాడు.
ఆటోలో ఎక్కించుకొని మార్కెట్ కి వెళ్ళాడు.
అందరూ శంకరయ్య వద్దెకే వచ్చి టమాటాలు, బంతిపూలు కొనుకుంటున్నారు.‌
అప్పుడు పక్కనే
అమ్ముకుంటున్న
మోసకారి రంగయ్య తో పరిచయమేర్పండింది.
రెండు మూడు రోజులు ఇదేవిధంగా లాభాలు రావడం రంగయ్య గమనించాడు.
మోసం చేయాలనుకుంటాడు.
ఒకరోజు  శంకరయ్య ఇంటికి బంధువులు వచ్చినారని భార్య ఫోన్ చేస్తుంది.అప్పుడు రంగయ్య తో ఇలా అంటాడు. నేను ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తాను.నా టమాటాలు, బంతిపూలు అమ్మి పెట్టగలవా! అని అడుగుతాడు.
ఇదే మంచి అవకాశం అని రంగయ్య సరేనంటాడు. మొత్తం బంతిపూలు టమాటాలు అమ్మి వేశాడు. శంకరయ్య వచ్చేసరికి రంగయ్య డబ్బులతో పారిపోయాడు.
శంకరయ్య
లబోదిబోమని నెత్తి కొట్టుకుంటూ,ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. కూతురుకు జరిగిందంతా చెప్తాడు.సరేనాన్న బాధపడకు ఉన్న దయితే అమ్ముకుందాం అని ధైర్యం చెబుతుంది.
మరునాడు మిగిలిన పోయిన పరిగె పూలు,పండ్లను ఆటోలో తీసుకొని వెళ్లుచున్నాడు.
మార్గ మధ్యలో పక్క బావిలో నుంచి నన్ను కాపాడండి!నన్ను కాపాడండి! అని అరుపులు వినబడుతున్నాయి. శంకరయ్య ఆటో ఆపి బావిలోకి తొంగి చూశాడు. ఎవరో బావిలో పడి దెబ్బలు దాకినట్లు ఉన్నాయని ఆలోచిస్తాడు.తాడు వేసి పైకి లాగుతాడు.ఆ వ్యక్తి ఎవరో కాదు!
నన్ను నిన్న మోసం చేసిన రంగయ్య అని తెలుసుకుంటాడు.
ఏంటి రంగయ్యా! ఇలా జరిగింది అని శంకరయ్య అడుగుతాడు.
అప్పుడు రంగయ్య తలవంచుకొని నేను చేసిన తప్పుకు సరైనటువంటి శిక్ష భగవంతుడు వేశాడు.
నన్ను క్షమించు శంకరయ్య అని పశ్చాత్తాపపడతాడు. ఇప్పటినుంచి నేను ఎవరిని మోసం చేయనని ఒప్పుకుంటాడు.
దొంగిలించిన డబ్బును తిరిగి ఇచ్చేస్తాడు.
అప్పటినుంచి రంగయ్య,శంకరయ్య మంచి స్నేహితులుగా మారిపోతారు.



కామెంట్‌లు