రాక్షసుడి పీడ:- రాయిళ్ల అఖిల్ -7వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల -జిల్లా సిద్దిపేట -9704865816.
 కాకులు దూరని కారడవిలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు.అతడు అడవిలోని జంతువులను దొరకబట్టి తినేవాడు.ఐనా కడుపు నిండేది కాదు. అడవిలోని జంతువులన్నీ రాక్షసుడి బారినపడి కొన్ని తప్పించుకున్నాయి.కొన్ని ఆహారమైనాయి.అడవిలో ఒక్క జంతువు లేకుండా పోయింది.
రాక్షసుడు ఆకలిని తట్టుకోలేక  పక్క ఊర్ల మీద పడి పసి పిల్లలను,పెద్దలను ఎత్తుకెళ్లి చంపి తినేవాడు.
ఈ విధంగా అతని ఘోరాలను భరించలేక గ్రామస్తులు అందరూ సమావేశమయ్యారు.
మనలో నుండి రోజుకొకరి చొప్పున ఆహారంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.రోజు కొకరు చొప్పున వెళ్లి అతనికి ఆహారంగా బలి అవుతున్నారు.
ఒకరోజు మాయలు,మంత్రాలు నేర్చుకున్న ఒక నందుని వంతు వచ్చింది.
అతనికి ఆ ఊరి పెద్దమనిషి తుపాకులు, కత్తులు, బళ్లాలు,బాంబులు ఇచ్చాడు.
నా మాయ మంత్రాలకు ఇవి తోడుగా ఉంటే రాక్షసుని ఆటలు కట్టించవచ్చని అనుకొన్నాడు.బాంబులను నడుముకు చుట్టుకొని,తుపాకులను రెండు భుజాలకేసుకొని,కత్తులను కాళ్లకు చెక్కుకొని బయలుదేరాడు.
పెద్ద మర్రిచెట్టు పైకెక్కి రాక్షసుడు ఆహారం కోసం అరుస్తున్నాడు.
ఒరేయ్ కుర్ర నా కొడుక!నాకు ఆకలి ఐతుందిరా!ఇంక ఎప్పుడు వస్తావురా అని కేకలువేస్తున్నాడు.నందుడు దగ్గరికి రాగానే అమాంతం మీద దుంకబోయాడు.వెంటనే నందుడు మాయమయ్యాడు. చెట్టు ఎక్కి హే రాక్షస!ఇటు చూడు!అనగానే రాక్షసుడు చెట్టు పైకి చూశాడు.
ఒరేయ్  నా చేతికి చిక్కురా!ఆకలౌతుందని గట్టిగా అరిచాడు.నందుడు గురిచూసి
కత్తితీసి రాక్షసుడి కాలుకు విసిరాడు.మళ్లీ దగ్గరకు రాగానే తన నడుముకున్న బాంబు తీసి అతని చేతికి విసిరాడు.అతని చేయి తెగి కింద పడ్డది.
ఒరేయ్ కుర్రోడా ఏమాయలు మంత్రాలు చేస్తున్నావ్ రా అని రాక్షసుడు అరిచాడు.
మళ్ళీ ఒక కొండపైకి రాక్షసుడు ఎక్కాడు, కుర్రాడు 
కిందికి దిగి భుజానికి ఉన్న తుపాకి తోటి రెండో చేతిని కొట్టాడు.రెండు చేతులు విరిగిపోయాయి.అయినా అతను పైపైకి వస్తున్నాడు. మళ్ళీ అరిసెటప్పుడు నోటిలోకి వెళ్లి ,అతని ముక్కులో నుంచి బయట పడ్డాడు.
చివరిగా తన దగ్గర ఉన్న తుపాకిని ఆపకుండా కాళ్లకు, నడుముకు, చాతిలో, కండ్లలో, తలకు, బుల్లెట్లు తగలగా రాక్షసుడు అరుచుకుంటూ కిందపడి చనిపోయాడు.
అప్పుడు ఊరివాళ్లు నందుడి ధైర్యాన్ని మెచ్చుకొని తగిన బహుమతి ఇచ్చి,  వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని దానంగా ఇచ్చారు.
ఇలాంటి ధైర్యం గల వ్యక్తి ఊరికి ఒకడు ఉంటే చాలు.
ఊరు క్షేమంగా ఉంటుందని తెలుసుకున్నారు.



కామెంట్‌లు