*ప్రకృతి దేవత*:- శిక్కె దీక్షిత్ -7వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల -జిల్లా:సిద్దిపేట-9704865816.
 పొన్నాల ఊరిలో నవీన్ ఉన్నాడు.అతను చాలా తెలివైనవాడు.ఒకరోజు ఊరంతా చూడడానికి వెళ్ళాడు.ఎక్కడ చూసినా బిస్కెట్ కవర్లు, చాక్లెట్ కవర్లు, కూరగాయలు తెచ్చుకొని పారేసిన కవర్లు,సబ్బు కవర్లు కనబడుతున్నాయి.
మరొక రోజు టీ తాగే హోటల్ కాడికి వెళ్ళాడు.
ఆ హోటల్ యజమాని ప్లాస్టిక్ గ్లాసుల్లోనే చాయ  ఇస్తున్నాడు.
ఒక రోజు పెళ్లి ఫంక్షన్ హాల్ కి వెళ్ళాడు.అక్కడ ప్లాస్టిక్ ఇస్తార్లో అన్నం, ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్ళు, ప్లాస్టిక్ గిన్నెల్లో స్వీట్స్ పెడుతున్నారు.
ఒకరోజు స్నానానికి చెరువు దగ్గరకు వెళ్తాడు.
చెరువు దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసినగణపతులు, డబ్బాలు చెరువులో ఉన్నాయి.ప్లాస్టిక్ కవర్లు తిని చనిపోయిన చేపలున్నాయి. ఇవన్నీ చూసి నవీన్ బాధపడతాడు.
ఒకరోజు బాధతో అడవిమార్గాన వెళ్తూ చెట్టు కింద పడుకున్నాడు.
కలలో ప్రకృతి దేవత ప్రత్యక్షమై
నవీన్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావ్!నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెబుతా విను.
నీవు ఊరిలోకి వెళ్లి మీ సర్పంచ్ గారిని కలువు మీటింగ్ పెట్టమను.ప్లాస్టిక్ కవర్ల యొక్క నష్టాలు చెప్పుమను ఇది పర్యావరణానికి అవరోధం అని చెప్పు అని మాయం అవుతుంది.
లేచి ఎవరు ఎవరు నాకలలోకి వచ్చింది ఎవరని చూశాడు.
ఓహో ప్రకృతి దేవతనా! దేవత చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకొని గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్లాడు.. ప్రకృతి దేవత చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. గ్రామస్తులు అందరు ఇది గ్రహించారు.తమ తప్పును తెలుసుకున్నారు.
ఇప్పటినుంచి మనము ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు.అది చాలా ప్రమాదమని తెలుసుకుంటారు.వాటి వలన రోగాలు వస్తాయని తెలుసుకున్నారు.
నవీన్ తెలివికి మెచ్చి గ్రామస్తులు సన్మానం చేసి గౌరవిస్తారు.
అప్పటి నుంచి బట్ట సంచులను వాడడం జరిగింది.



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice
అజ్ఞాత చెప్పారు…
Very good laddu babay