*ఓర్వలేనితనం*:- కొత్త చాకలి అమూల్య -7వ, తరగతి.-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల-జిల్లా సిద్దిపేట.-9704865816.
 ఒక ఎల్లుపల్లి గ్రామంలో నర్సయ్య,మల్లయ్యలకు ఇద్దరికి టిఫిన్ సెంటర్లు ఉన్నాయి.నర్సయ్య ప్రతిరోజు తన బండిచుట్టు పరిసరాలను శుభ్రం చేసేవాడు.మార్కెట్ కెళ్ళి తాజా కూరగాయలు తెచ్చి కూరలువండి,టిఫిన్స్ చేసేవాడు.జనాలు అతని బండివద్దకు ఎగబడివచ్చి టిఫిన్స్ చేసేవారు.
కానీ మల్లయ్య దగ్గరికి ఎవరు రావడంలేదు.
బండి చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి.
తాజాకూరగాయలు తేడు.
మిగిలిపోయిన పిండిని,కూరలను మరుసటి రోజు టిఫిన్స్ లో పెట్టేవాడు.
అందుకని ఎవరు గూడా అతని బండిదగ్గరకు రావడంలేదు.
ఒకసారి తిన్నవారు మళ్లీరావడంలేదు.
నర్సయ్య బాగుపడడం చూసి మల్లయ్య ఓర్వలేక పోయాడు. మల్లయ్య ఒకరోజు రాత్రి అవగానే ఎవరికి తెలియకుండా నర్సయ్య టిఫిన్ బండిని కాల పెడతాడు.పొద్దున లేసి నర్సయ్య టిఫిన్ బండి దగ్గరికి రాగానే కాలిపోవడం చూసి లబోదిబోమని  మొత్తుకుంటాడు.
చాలా బాధపడతూ, ఏడుస్తాడు.
మల్లయ్య మనసులో చాలా సంతోష పడతాడు.
ఇప్పటినుండి నా బండి దగ్గరే జనాలు టిఫిన్స్ చేస్తారని కలలుకంటాడు.
కాని మునుపటి మాదిరిగానే టిఫిన్ చేయడానికి జనాలు ఎవరు రావడం లేదు.
"ఏందబ్బా!నర్సయ్య టిఫిన్ బండి కాలబెట్టినగాని నా వద్దకు ఎవరు రావడం లేదు" అని ఆలోచిస్తూ కూర్చుండేవాడు.
నర్సయ్య బాధను దిగమింగుకొని  ఒక టేబుల్ తెచ్చుకొని టిఫిన్స్  తయారుచేసి అమ్మడానికి సిద్ధమయ్యాడు.
జనాలు మునుపటి కంటే ఎక్కువ మంది వచ్చి టిఫిన్ చేస్తున్నారు.నర్సయ్య కళ్లలో ఆనందం కనబడుతుంది.
చివరకు మల్లయ్య టిఫిన్ సెంటర్ నడవక నష్టాల పాలై బండినే అమ్మేసుకుంటాడు.




కామెంట్‌లు