కల కాలిపోయింది...:- ప్రమోద్ ఆవంచ - 7013272452

 జోరు వానతో కన్నీళ్లు జతకూడి
అక్షరాలుగా ప్రవహిస్తున్నట్లు
మండుటెండలో ఒంటరి ప్రయాణం 
కన్నీళ్ళ జాడ కోసం వెతుక్కున్నట్లు 
కలలన్నీ ఎడారి వానలో తడుస్తున్నట్లు
ప్రతి క్షణం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి 
అవుతుంది 
నిన్నటి జ్ఞాపకం మస్తిష్కంలో ఈదుతున్నట్లు
రెక్కలొచ్చి మనం ఎటో ఎగిరిపోయినట్లు 
నిశీధి మబ్బుల్ని వీడి వెన్నెల ప్రపంచాన్ని 
చూసినట్లు
గర్జించిన ఆకాశం ముఖంలో మెరుపులు 
గుండెల్లో గుబులు రేపుతున్నట్లు 
కాళ్ళు కింది నేల కదులుతుంది 
నీ పాదాలను గట్టిగా పట్టుకున్న నా చేతులు 
వణుకుతున్నాయి
ఎప్పటికీ నీ ఊహ నా మదిని ఉల్లాస మందిరం 
చేసినట్లు 
నా మనసులో నీ మాటల ఊట ఊరుతున్నట్లు
ప్రేమ ప్రవాహంలో పడి మనం ఊరేగుతున్నట్లు 
మనం ప్రపంచ యాత్ర చేస్తూనే ఉన్నాం 
మరేంటి ఇప్పుడు...
ఇంకా ఏదో మిగిలి ఉన్నట్లు 
ఇంకేదో తెలియని తీరాలను తాకాలని 
మరేదో ఒక నీ తీయని స్పర్శ మళ్ళీ మళ్ళీ 
కావాలనీ 
కలిసిరాని కాలంతో పోరాటం చేస్తున్నట్లుంది 
కల కాలిపోయిన వాసన ముక్కుపుటాలను 
వెక్కిరిస్తుంది...
                         
కామెంట్‌లు