ఊరుగాలి ఈల 78:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
గాలి పిలిచే నన్ను ఊరంతా తిరిగి పాట పాడంగా 
ఊరు రమ్మని చెప్పే నాకు గాలితో కలిసి ఆటలాడ
వాన నడుమ వగలుపోయే తీగరాగం చిటపటలై

ఊరు నేర్పే నాకు ఆరోగ్య మంత్రమే  పనిపాటల
అంబలితిండి పనిపొలం నడక బిపీ షుగర్ రాదని
నవ్వుతూ తిరగమనే భాయ్ కొవ్వులే పెరగని పల్లె

మైదాన పరుగుల ఉల్లాస బాల్యమేది చూడగా
గోలీల ఆటల తొండి చెవిపిండిన కాలం మెక్కడో
మనసు తెలిసిన ఊరు పిలిచే నాటి బాల్యకళల

అలిసిన ఆనందమే సోలిసినా సంతోషం పల్లె కాల్
తలచి పోతిమి వలచిన బాలప్రేమ నెరిసిన తలల
నన్ను మరువని యాది నీతోకూడి రమ్మనే బువ్వ

ఆట ఆడిన నేల పాటపాడిన ఈల ఊరంత పిలిచే
గాలి గంధము తోడ కబురంపె ఊరు నాకై తీపిగా
ఎంత మంచి మనసది ఊరంతా ఉప్పు కారం తినే

కోపముంటే కోడి మింగని లవ్వునవ్వే పువ్వు
ఆశ దోశ అప్పడం ఆటపట్టించే ఊరోళ్ళే నాతోటి
అమ్మ చూపు నవ్వు బొమ్మల కొలువు పేరంటమే

నిన్న మొన్నటి ఆటలే మాయం నాది కొత్తాట దారి
ఎర్రబస్సు తుస్సనే గాలి నే గాలిమోటర్ తేలే 
తోకలేనిపిట్ట కబురు బుర్రుపిట్ట ప్రేమ పల్లె నిద్ర

=========================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు