నాన్న ;- కొత్వాల్ సాయిరామ్ -8వ తరగతి,-ప్రభుత్వ ఉన్నత పాఠశాల,-రాజ్ భవన్, సోమాజిగూడ,-హైదరాబాద్, 500082.-చరవాణి :9848518597
 నాన్న నువ్వంటే నాకు ఇష్టం 
నువ్వుంటే లేదు నాకు కష్టం 
నాన్న నీవు లేకుండా ఉండలేను 
నాన్న నీవు ఒక్కసారి కూడా కష్ట పెట్టలేదు 
అందుకే నేను నిన్ను విడిచిపెట్టలేదు 
నాన్న నీవు నాకు దేవుడితో సమానము 
అందుకే నాన్న అంటే నాకు ఆధరాభిమానము 
నాన్న నీవు నాకు నీడలా ఉంటావు 
అందుకే నేను నీకు తోడుగా ఉంటాను 
నాన్నకు నాన్ననే సాటి 
ఎవరితో నాన్నకు లేదు పోటి 
నేను చేసే మంచి పనులను చూస్తూ ఉంటాడు 
నాన్న తన్మయత్వంతో ఉప్పొంగిపోతాడు 
     అందుకే 
నాన్న నువ్వంటే నాకు ఇష్టం 
నువ్వుంటే లేదు నాకు కష్టం.
 
.

కామెంట్‌లు
Vojjala Sharath babu చెప్పారు…
సాయిరాం! నాన్నను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. బాగుంది కవిత. ఇలా ఇంకా అభ్యాసం చేస్తూనే ఉండు! మీ ఉపాధ్యాయుడికి నీకు అభినందనలు.
Vojjala Sharath babu చెప్పారు…
సాయిరాం! నాన్న ను సరిగ్గా అర్థం చేసుకుంటూ నీవు రాసిన ప్రత్యక్షరానికి నీకు అభినందనలు. ఇంకా ఇలానే రాస్తూ. గొప్ప పేరును సంపాదించుకోవాలి. మీ సహృదయ ఉపాధ్యాయుడికి అభినందనలు.
Koduri sai kumar చెప్పారు…
చాలా బాగా రాశావూ సాయి ..ని తొలి కవిత నాన్నకు అంకితం.. సూపర్..❤️