ప్రతిభ అందరిది:-సంకటి సిరిచందన-8వ,తరగతి--జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల -సిద్ధిపేట జిల్లా -9704865816
 
అఖిల, నిఖిల ఇద్దరు మంచి స్నేహితులు.ఎనమిదవ తరగతి చదువుచున్నారు.
ఒకే బెంచీలో కూర్చుంటారు.
కానీ ఇద్దరివి వేర్వేరు గ్రామాలు. అఖిల వాళ్ళ ఊరు రామచంద్రాపురం.నిఖిల వాళ్ళ ఊరు రాజంపేట.అఖిల రోజు సైకిల్ పైన బడికి వెళ్తుంది. ప్రకృతి అందాలు చూసుకుంటూ స్వయంగా పాటలు రాసుకుంటూ, పాడుకునేది.
కానీ నిఖిల మాత్రం అసలు చదివేది కాదు.ఒళ్లు బద్దకం.
ఒకరోజు అఖిల రాసి,పాడిన పాటను తెలుగు సారు చూసి అందులోని దేశభక్తిని మెచ్చుకున్నాడు.
ఇలా సమయం వృధా చేయకుండా ఎన్నో పాటలు రాసుకునేది.ఇంటికి వెళ్ళగానే సార్లు ఇచ్చిన పనిని పూర్తి చేసేది.అఖిల చదివే కాకుండా, పాటల్లో, ఆటల్లో కూడా చురుకుగా ఉండేది.
ఆటల పోటీలలో తానే ఫస్ట్ వచ్చేది. ఇలా ఉండగా ఒకరోజు తెలుగు సార్ తరగతిలోకి  వచ్చాడు.
ఒరేయ్ పిల్లలు!మన బడికి మండల విద్యాశాఖాధికారి వస్తున్నాడు అని చెప్పాడు. కొంత సమయం తర్వాత ఏం.ఈ.ఓ సార్ వచ్చారు.బడి పరిసరాలు పరిశీలించి అన్ని తరగతిలలోకి వెళ్లాడు.
చివరగా ఎనమిదవ తరగతి లోనికి వచ్చాడు.
ఒక్కొక్కరిని ప్రశ్నలుఅడిగాడు.
ఎవరు సమాధానాలు చెప్పలేకపోయారు.
అఖిల మాత్రం తడబడకుండా ధైర్యంగా,ఏది అడిగిన  సమాధానాలు చెప్పింది.
ఇంకా అఖిలలో చాలా కళలు ఉన్నాయని తెలుగు సారు చెప్పారు.అప్పుడు ఏం.ఈ.ఓ గారు ఒక మంచి పాట పాడమ్మా అని అడిగారు.మధురమైన కంఠంతో మంచి దేశభక్తి గేయం పాడింది.ఎం.ఈ.ఓ.గారు  ఆమెలో ఉన్న ప్రతిభను చూసి మెచ్చుకొని మంచి కథల పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు.
ఇదంతా గమనిస్తున్న నిఖిల మనసులో చాలా బాధపడుతుంది.
నేను కూడా అఖిల లాగా సమయం దొరికినప్పుడల్లా పాటలురాసుకుంటే ఎంతబాగుండేదో!అనుకున్నది.
అప్పటి నుంచి 
సార్లిచ్చిన హోంవర్క్ చేసుకునేది.చదువుతోపాటు, ఆటల్లో,పాటల్లో అఖిలలాగా ముందుంటానని ప్రమాణం చేస్తుంది.నిఖిల, అఖిల ఒకరికొకరు చదువులో ముందుండి ప్రథములుగా నిలిచారు.



కామెంట్‌లు