నాంచారి పల్లిలో నరసయ్య అనే రైతు ఉండేవాడు.అతనికి భార్య,కొడుకు,కూతురు ఉండేవారు.పొద్దున లేవగానే కొడుకు,కూతురుకు సద్దిగట్టి బక్రిచెప్యాల బడికి పంపేవారు. తల్లిదండ్రులు ఇద్దరు పొలం పనులకు వెళ్లేవారు.
అతనికి మూడెకరాల పొలం ఉన్నది.ఒక ఎకరంలో వరి పంట వేసేవాడు.ఒక ఎకరంలో అర్థ ఎకరం మొక్కజొన్న వేసేవాడు.అర్థ ఎకరం బర్లకు సొప్ప వేసేవాడు.
మిగతా ఎకరంలో రకరకాల కూరగాయలు పండించేవాడు. వ్యవసాయదారుడు కాబట్టి కొన్ని పాడి బర్లు ఉండేవి.
వాటికి నిత్యం సొప్ప పెట్టి,పిండిపెట్టేవాడు.
పాలు పిండి దగ్గరలోని సిద్దిపేట పట్టణానికి వెళ్లి పాలను అమ్ముకునేవాడు. పండిన కూరగాయలను అతని భార్య గంపల్లో పెట్టి తన చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి అమ్ముకొని వచ్చేది.
ఎవరిపైన ఆధారపడకుండా
వారి కుటుంబం
సంతోషంగా ఉండేది.
ఎండనక,వాననక కష్టపడి పనిచేస్తే మంచి పంటలు పండించ వచ్చని తండ్రి భావించేవాడు.
కానీ ఒక సంవత్సరం వర్షాలు పడక బోర్లలో నీళ్లు అందలేదు. నరసయ్య అతని భార్య చాలా బాధపడ్డారు.వీరి బాధను కొడుకు అర్థంచేసుకున్నాడు.
నాన్న నువ్వు బాధపడకు.నేను చదువుకొని పెద్దయిన తర్వాత మిమ్ములను కళ్ళల్లో పెట్టి సాదుకుంటాను.
ఈ సంవత్సరం కాకపోతే మళ్ల వచ్చే సంవత్సరం వర్షాలు పడతాయి.
మళ్లీ మన బోర్లకు నీళ్లు వస్తాయి.
పంటలు పండించుకుందాం అని కొడుకు ఓదార్చాడు.
కొడుకు అన్నమాటలకు తండ్రి ఈవిధంగా అంటాడు. పెద్దయినంక నన్ను సాధుతాను అంటున్నావు.
కానీ రైతు పనిచేస్తే నాలాంటి ఒక్క మనిషినే కాదు కొన్ని వేలాది మందికి అన్నం పెట్టవచ్చు.అందుకే రైతును అన్నదాత అన్నారు బిడ్డా! అని తండ్రి అన్నాడు.
నేను కూడా పెద్దగైన తర్వాత అగ్రికల్చర్ డిగ్రీ చేస్తాను.
నేర్చుకున్న విషయాలను వ్యవసాయంలో వినియోగిస్తాను.
గొప్ప గొప్ప పంటలు పండిస్తాను.దేశానికి అన్నం పెట్టే అన్నదాతనైతానని కొడుకు అంటాడు.కొడుకు మాటలకు కళ్లల్లో ఆనంద బాష్పాలునిండాయి.
ఈ విధంగా చదువుకున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కెదురుచూడరాదు.రైతుగా కూడా బతికి వేలాదిమందికి అన్నం పెట్టవచ్చనే నీతిని తెలుసుకోవాలని తండ్రి కోరుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి