కష్టే ఫలి : ఏం.లక్ష్మీ ప్రసన్న8 Th E1 ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల. సిధ్ధిపేట
 అనగనగా ఒక ఊరిలో సోము అనే వ్యక్తి ఉండేవాడు ఆయన కటిక పేదరికంలో బ్రతుకుతున్నాడు సోము వాళ్ళ అమ్మ ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నదే లేదు సోము వంతెనలు కట్టి సంపాదించిన డబ్బు అంతా వాళ్ళ అమ్మ మందులకే ఖర్చయ్యేది. ఒకరోజు సోముకి ఒక పెద్ద వంతెన కట్టడానికి అవకాశం వచ్చింది అది కడితే 50 లక్షలు ఇస్తామని ఆ వంతెన యజమానులు చెప్పారు కానీ ఆ వంతెన కట్టే పనిలో చాలా శ్రమికులు చనిపోయారు అని వాళ్ళు చెప్పారు అప్పుడు సోము మనసులో నేను ఆ వంతెన కడితే మా అమ్మకు మంచి వైద్యం అందించొచ్చు అనుకొని నేను కడతా అని చెప్పాడు తదుపరి రోజే పని ప్రారంభించాడు కానీ కట్టినప్పుడల్లా వంతెన కూలిపోయేది అలా మూడుసార్లు జరిగింది ఆయన నిరాశ పడకుండా ఆఖరి ప్రయత్నం అనుకొని వంతెన కట్టడం ప్రారంభించాడు అలా కొన్ని రోజులకి మంచి దృఢమైన వంతెన కట్టి 50 లక్షలు తీసుకున్నాడు అప్పుడు వాళ్ళ అమ్మకు మంచి వైద్యం అందిలా చేశాడు అప్పటినుండి అమ్మ మరియు సోము ఇద్దరూ సంతోషంగా జీవించసాగారు

నీతి..కష్టపడితే ఏదైనా సాధించవచ్చు.

కామెంట్‌లు