ఊరుగాలి ఈల 82;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
అప్పుచేసి పప్పుకూడు ఇల్లే వడ్డీగడ్డి తిననిదే పల్లె
పాడులోకం చీడపురుగు చేరిచెరుచు పదిలం పల్లే
చేరదీదు ఉత్తరుల చేవ్రాలే నమ్ముటే  పల్లెవిద్య రా

ఆశపడదు మోసపోను కలలపొద పల్లె కలతలేక
మట్టి తినగ మందలించు కృష్ణ ఊరు జీవిక నాది
గుండె నిబ్బరం నేర్పే నిభాయింపు ధీర పల్లెగుంపు

ఆవుపాలు గంగగోవు గోగుపూల సిరిసిరి నా పల్లె
గోడెక్కి దూకిన విరుగలే కాలు ఊరే జిమ్నాస్టిక్ ప్లే
ఆట తెలియని ఆటగాన్ని నేనేమీ రాని ఊరోన్నిబ్రో

అమ్మకొంగే నా నడక కలిసిఆడే నేనేలే ఊరూవాడ
చిర్ర కొడితే తాకేనని భీతి కబడ్డీల పల్లె కాల్గుంజేనే
ఆమె నా నీడ ఆ నీడే నా జాడ ఊరు అడుగడుగు

అటుపో! బీరతీగ ఇటురమ్మనే పొట్ల పల్లే గుమ్మడి
అందానికి కేంద్రం ఆ కవితాలహరి కిటికీ నింగినేల
నుడిసడివడివేడితడి పడిలేచే పడిగల్లీ ఊరంతా

బోన్ మ్యారో బొక్కబలం పిక్కతిన్న పిక్కబలంలే
వెజ్ నాన్ వెజ్ కన్నా పచ్చడిమెతుకే ఇష్షం అంతే
నిన్ను ఎవరు ఏల పిలిచారో పిచ్చిపల్లె పిల్లలేప్రేమ

ఎవరని చెప్ప ఏమని చెప్ప తడిలోపల్లె  విచ్చేవిరి
కన్నుగీటి పిలిచే జలకన్య ఫేన వనకన్య మట్టిపల్లె
ఉన్నకాడే బుక్ చదువే లుక్ కష్టంనీది ఫలే పల్లెసిరి
==================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు