ఊరుగాలి ఈల 83:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఓనమాలు నేర్పింది మాట ఊరు గొప్ప దారిపర్చి
గుఱ్ఱమాటల కుప్పిగంతులే సరదా దీర్చేలే ఊరు
కంటిచూపుల లాగేసే బలం పల్లె నేర్చి నేర్పే విద్య

వివేకం అనుభవం రెండు నా నడక పాదాలదే పల్లె
అప్పుతిప్పలన్నీ అచ్చుతప్పుల పుస్తకం తిప్పే పల్లె
రవళించే రాగాలెన్నో కరుణించే కనుల కాపు పల్లె

మ్యూజియం ఎగ్జిబిషన్ లేవు పాకలు పసులే పల్లె
ఉట్టిమీది వెన్న గట్టుమీద వెన్నెల మెత్తని పల్లెతేలే
అవని మబ్బులు ఊగే ఆకాశం దిగే నే పిల్వఊరై

ఇంధనం బంధాల అందాలు పల్లెపిల్ల ఆటే లొల్లిల
ఊపే ఊయలే గాలిఈల కీసుపిట్ట కట్టతెగిన రాగం
చాయ్ కాఫీ వద్దు పాలు పెరుగే ఊరు పంటచేలు

అంబలి కంబలి తోడూనీడ నను వీడని జిగ్రీ దోస్తీ
వాకిలి వసారా కొత్తపాత ఇల్లే ఊరువాడ బోనం
అమ్మ ఆవిరిపట్టే నొప్పిపాయే కలలా నా కళే హెల్త్

పిప్పిరాని చెరుకు గానుగగడ తిరిగేపల్లె కథల ట్రూ
అలిశిందల గింజ ఉడికే రుచే నోరుజేర పల్లెగిల్లే
అమీబా ఏకకణం మనిషి బహు దారి ఎగరే బంతి

ముఖం ఆనందం వెల్లువ నేపల్లె అందం కూనిరాగ
శూలనొప్పి కాపే జల తలనొప్పి బామ్ ఆరాంఘర్
ఊరు పల్లే మట్టీ నేల అన్నీ నావే నేనే గాలి ఈల

==================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు