అంబాడే నన్ను నడిపించె ఊరు విస్తరి మర్రిచెట్టు
పాలు తాగే పాప తినే బువ్వ ఆడే పల్లె మందారం
వచ్చీపోయే బుయ్ రోడ్డుమీద ఊరు ఎర్రబస్సెక్కే
మారంచేసే మనసు నాదే వారించే తల్లే ఊరు దేఖ్
మట్టితిన్న నోరు చిన్నదే అరుపే పెద్ద పల్లే కనిపెట్టే
అమ్మకొంగు ఆన అల్లరేలేదు కల్లలెరుగనదు పల్లె
బాలలోకం బాలమల్లు కోమటిపిచ్చయ్య నేమరిచే
ఊరు దొడ్డది బిడ్డలు ఘనులే పనిపాటసేవలే పల్లె
ఉల్లిమేలు మరువని ఊరది నన్నెత్తి ముద్దాడే నేల
కాయకష్షాల చేతిచేత అమ్మ ఊడ్చే కస్వు వాకిలి
ఎత్తుకొని వీపుపై నన్నాడించె అలుకుజల్లే తల్లిపల్లె
ఏడుపాప నాకు పాలిచ్చె అమ్మ తేటతీపి నిద్రజారే
అమ్మ వదలని నన్ను కాపాడె అమ్మకొంగురా పల్లే
ఆకుచాటు చెట్టునీడ రక్ష బాలలూగే తొట్లేఊరుపో
మాటలేదు పాటే ఊపిరి మూట వెలిగె ఊరువీధి
పెరుగువెన్న పెంచె పెరిగినే బడికిపోతే నిమిరే తల
పలక బలపం ఆటలో అక్షరం నేర్పేసారు ఊరేలేర
పరీక్షల ఫస్టు వచ్చుడె విద్య మనసున తృప్తి ఊరే
కొత్తపాతలేదు తిరిగేదే ఊరువాడ మెచ్చ జనులు
ఆకలికి ఆటలు దూపకు పాటలు కలిసెనా సోపతి
ఊరు తేనీరు పల్లె సిరి నవ్వుల విరిసే ఆనందాలు
===============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి