ఊరుగాలి ఈల 85:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆటపట్టించదు అటుకెక్కించదు  ఊరు తడీపొడి
తలుపులేని దర్వాజ ఓపెన్ కిర్రుమనే ఊరు పెన్
ఆశ బాధ తెలువని సుఖదుఃఖాలే పల్లే ఊసుపోక

తల్లికి పిల్ల ఊరుకు తల్లి చేరదీసే పల్లె బంధమిదే
ఎంత మంచిది ఎన్ని నేర్పే పల్లె మరువక చెప్పేలా
గొప్పలు పోదు ఊరు ఆలిచిప్ప ముత్యం తీరున

అందం బంధం,సోయగంసొంతం కాదు వేర్లేఊరై
పిల్లాటే గిల్లాట జోపుడే కండ అండదండ ఊరురా
ఆకురాలదు తుంచచేత నోరూరే వాసన పల్లెసీమ

గలాటలేదు లొల్లిలేదు శాంతి ఊరు పాటలమూటే
మాడుపగలని వేటలేదు మాటపడదు పల్లెనిఖిర్సే
రావడం పోవడం ఫ్రీ ఆయారాం రాజకీయం నహీ

అర్థమేలేని మాట అనర్థమే నిందలేదే నీడనే చెట్టు
పాలనోరు క్రై ఆకలైన పిల్లలఉగ్గు ఊరువాడ నేనే
ఓలలాడే జీవనవ్వు జోల బతుకు నేనే పాటేఊరు

రాగాలొచ్చే ఏడ్చిన రోగాలే పాయే పల్లె గీత్ లైఫ్ ఓ
నడక నడత మారని ఊరు పెదాల పాట ఆతోటనే
ఆదరం అవసరం ఉంది ఊరంటే అదే ఊపిరితోట

ఎవరిదయ్యా ఈ ఊరు కోరివచ్చినవారి పక్షిదే కళ
తోడునీడ కాచె నన్ను పోతివీడి ఆటగా పల్లెనేకథ
ఊరు ఊరని ఎగిరినీవు జారితివి ఏల సిరి పల్లెపా
====================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు