ఊరుగాలి ఈల 87:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఓ మనసు గంతు మరొకటి మూగ పల్లె తలపాగ
పడిలేచే ఆట పరుగు స్లో పాట శ్రుతి శుభం ఊరు
ఎవరు నేర్పారో మంద్రగతి ఊరుకీగాలి  ఈలపాట

పల్లెపాట నే నేర్చిపాడిన ఘనత గాలి గాంధర్వమై
ఆరని గొంతుల కోయిల పాట దాటేసే ఊరుదారే
ఆకుపచ్చ లోకం ఊరు పచ్చని బతుకు పంటసీమ

పాలుగారే వయసు పడిలేచే సొగసు పల్లె బతుకు
పడమర దారి వయసు శక్తులుడిగే మది ఊతకర్రే
బాధల దాచి చిలికించే నువ్వులుచిన్నూ అమ్ములే

కాపాడే ఊరు నన్నే డ్రోన్ రాడార్ స్కైవే నాకాపే గో!
ఊసంతా ఊరు తిరిగే గలగల మది మారాంచేసే
మర తిరిగే మనిషికాదే ఊరు ఓపికబట్టే స్థిరచిత్తం

బాసటలో ముందు ప్రేమల ఊపే పల్లె నా ఊయలే
ఊరు బిజీ ఫ్రీనేనే ఫ్రిజ్ హిమం కొరికేచలి అన్నాత్మ
నసపెట్టదు కోడికూత ఠంచన్ లేపే నిద్ర ఊరుపల్లే

కొందరు కొత్తగా పాతనీరు చెత్తగా రాకపోకల పల్లె
చామకూరవెంకటకవి కాదది వీడే  చా. సోమయ్య
ఈల గలగల  విరిగే అలల హోరు ఊరే చెలిమిలేక

వానకుతడీ చలికిముడిసే బట్టపేగే ఎండకెండే పల్లె
సలసల కాగే ముద్దమంచే జరజర జారెగ క్లైమేట్
ఊరుకైనా నాకైనా జీవన వాహిక ఓ జ్వరమానినే 
====================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు