ఊరుగాలి ఈల 88:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
అవును వారు నాతో తిరిగిరి ఊర్ల నన్ను తిప్పిరివై
ఆ మట్టి చెమట చేతివేలునే నే పల్లెప్రేమ బాలున్నే
నిద్రలో చీకటి పగలు వెలుగు నా చుట్టే చుట్టేసే సీ

మొదలు చూడలే చివరా చూడ ఊరురూపే కల
మసక చీకటి వయసు మర్లే మాట స్పర్శే మదికథ
ఆయన వైతాళికుడు ఊర్ల కనిపెట్టిచూసే తీర్తీర్లఐ

మందలు చెల్కలకు పొద్దున్నే వాటెంటే నేనే పెద్దా
కాచుడేముందనేటోడు కాస్తేగా బాధ కథ తెలిసేది
చెల్లనిపైసా గీతలెన్నో గిల్లిన తెలుసాకథ పిల్లప్రేమ

గంజిదాగి మెరుపు కాయితం అంటే లై గోందే జోడీ
ఊరు ప్రియ చెలినేస్తం హస్తంచిక్కలే కుదురే లేదు
లవ్ బర్డ్స్ గాలి అలల కొంగేసే వానచలి రక్షణపల్లే

వగలుపోయే వాన పగచలి రౌద్రంఎండ  పల్లె ఫ్లైఫ్లై
ఆటే ప్రకృతి చిగురు వగరు ఆకు అలం ఊరు నగే
అయ్యగారు వర్జ్యం అంటే యువరొద పర్జన్యమేసీ

డాక్టర్ లేని ఊరు అందరూ వైద్యులే రోగం పరార్
హుష్ కాకి ఏకాకి పాట వినపడక మనసది బేజార్
ఇల్లొదిలి ఊరు హుషార్ జాతరొచ్చే మేళం బజార్

అంగడి చూడ గొంగడి కొనే పల్లె చలిలే ఎండేకాచే
ఊరు ఉడికే అన్నం వాకిలి చెప్పులే మోదుగాకు
తిక్క అటుకెక్క పక్కకుదరని కుక్కపిల్ల పరుగేపల్లె
=======================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు