నా కోసం.....: గాదరి హేమ శ్రీ, 8వ, తరగతి, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గోషామహల్, అంబర్ పేట్,హైదరాబాద్.
నాకు చదువుని ఇచ్చావు 
నేను తెలిసి తెలియక చేసిన తప్పుకు నన్ను శిక్షించావు 
నాకు నా తప్పు తెలిసేలా చేశావు 
ఇదంతా నా బాగు కోసమే చేశావు 
నాకు చదువు నేర్పించడంలో గురువు అయ్యావు 
నాకు ఆడపిల్ల బాధ్యతలు నేర్పించడంలో అమ్మవయ్యావు 
నాకు మంచి చెడుల గురించి చెప్పడంలో నాన్న అయ్యావు 

నా ఆరోగ్యం విషయంలో వైద్యుడువయ్యావు 
దేవుడీలా నా వెంటే ఉండి నన్ను గెలిపించావు 
నీ వెనక నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చావు 
నేను విజయం సాధిస్తానని నమ్మకం పెట్టుకున్నావు 
నీ నమ్మకం నిజం చేస్తానమ్మా 
నన్ను నమ్మమ్మా!  
                                                  
                          

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగుంది నీ కవిత. నీ కలంతో కమ్మని అమృత వాక్యాలను రాస్తూనే ఉండు తల్లీ 🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹
అజ్ఞాత చెప్పారు…
చక్కని కవిత 👌🏻బాగుంది. శుభాశీస్సులు. భవిష్యత్తులో మంచి కవిత్వం రాసి గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను 💐💐💐💐
అజ్ఞాత చెప్పారు…
చక్కని కవిత 👌🏻చాలా బాగుంది. భవిష్యత్తు లో మంచి కవిత్వం రాసి గొప్ప పేరు సంపాదించాలని ఆశిస్తున్నాను 💐
అజ్ఞాత చెప్పారు…
చక్కని కవిత బాగుంది 👌🏻👌🏻👌🏻
అజ్ఞాత చెప్పారు…
చక్కని కవిత 👌🏻చాలా బాగుంది
అజ్ఞాత చెప్పారు…
చక్కని కవిత. చాలా బాగుంది 👌🏻శుభాశీస్సులు
అజ్ఞాత చెప్పారు…
ఈ నాటి బాలకవయిత్రి ముందుముందు ఇలాగే రచనలు చేయాలి....ఆశీస్సులు
వేణు మాధవ శర్మ చెప్పారు…
బాగా రాసావమ్మా....ఆశీస్సులు