అది ఒక ప్రభుత్వ పాఠశాల.అక్కడ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్పేవారు.
ఆ పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు వచ్చేవారు.అందరి పిల్లలకొరకు ఒక బస్సు ఏర్పాటు చేశారు.డ్రైవర్ని కూడా పెట్టించారు.
తల్లిదండ్రులు పిల్లలను తయారు చేసి బడికి పంపేవారు.బస్సు డ్రైవర్ కు సిగరెట్టు తాగే అలవాటు ఉంది.
ప్రతినిత్యం పిల్లలను తీసుకొని పాఠశాలలో దింపేవాడు. సాయంత్రం కాగానే మళ్లీ ఇండ్లకు చేర వేసేవాడు. డ్రైవర్ కు 'సంజన' అనే ఆరవ తరగతి అమ్మాయి అంటే చాలా ఇష్టం.ప్రతిరోజు తన సీటు పక్కనే కూర్చోపెట్టుకొనేవాడు.
మంచి మంచి విషయాలు చెప్పేవాడు.కథలు కూడా చెప్పేవాడు.సిగరెట్ తాగడం మంచిది కాదు అంకుల్ అని సంజన ఎపుడు చెబుతూ ఉండేది.సంజన మాట వినేవాడుకాదు. సిగరెట్ పొగ ప్రతిరోజు సంజన పీల్చుకునేది .కొన్ని రోజులకు బడి మానేసింది.
డ్రైవరుకు సంజన రాకపోయేసరికి బాధపడతాడు.
ఏందమ్మా! సంజన బడికి రావడం లేదు!అని మిగతా పిల్లలను అడిగాడు.ఏమో! అంకుల్! మాకుతెలియదు అని పిల్లలంటారు.సంజన మీద బెంగతోటి సిగరేట్లు ఎక్కువ తాగుతున్నాడు.ఒకరోజు వాళ్ళ ఇల్లు ఎవరికైన తెలుసా?అని అడుగుతాడు.
నాకు తెలుసు అని దీప్తి అంటుంది.అప్పుడు అమ్మాయితో కలిసి వాళ్ళింటికి వెళ్తాడు.వాళ్ళ ఇంటిదగ్గర సంజనవాళ్ల అక్క మాత్రమే ఉంటుంది.మీ చెల్లి స్కూల్ కు రావడం లేదు అని డ్రైవర్ అడుగుతాడు.మా చెల్లి హాస్పిటల్ లో ఉంది అంకుల్ అని చెప్తుంది.
ఎలాగైనా ఆసుపత్రికి వెళ్లి సంజనను చూడాలని డ్రైవర్ హైదరాబాద్ వెళ్ళుతాడు. ఆసుపత్రిలో వాళ్ళ తల్లిదండ్రులను కలుస్తాడు. సంజనకి ఏమైంది అని అడుగుతాడు.
సంజన క్యాన్సర్ జబ్బుతో బాధపడుతుందని
జవాబిచ్చారు.సంజనకు ఎంతపనైందని మనసులో బాధపడతాడు.ఒకసారి నాకు సంజనను చూపించండని తల్లిదండ్రులను అడుగుతాడు.అప్పుడు సంజన ఉన్న మంచం దగ్గరికి తీసుకవెళ్లండి అంటాడు.
సంజనను చూడగానే డ్రైవర్ కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నవి.
నోటి మాట రావడం లేదు.
డ్రైవర్ను చూడగానే సంజనకు సంతోషం కలిగింది.
అంకుల్ !అంకుల్! బాగున్నారా?రోజు మంచిగా పిల్లలను బడికి తీసుకెళ్తున్నావా? అని అడుగుతుంది.
డ్రైవరు దుఃఖం ఆపుకోలేక పోతున్నాడు.
సంజన తల్లిదండ్రులను బయటికి పొమ్మంటుంది. డ్రైవర్ను తన మంచం పక్కన కూర్చోబెట్టుకుంటుంది.
అంకుల్! నాకు ఒక పని చేసి పెడతారా!అని అడుగుతుంది.
చెప్పమ్మా! అని డ్రైవర్ అడుగుతాడు.ముందుగ నాకు మాట ఇవ్వు చెప్తాను అని అడుగుతుంది.సరేనమ్మా అని మాట ఇస్తాడు.మీరు సిగరెట్ తాగడం మానేయాలని అడుగుతుంది.మీరు తాగే సిగరేటు పొగ నేను పీల్చుకోవడంవలన క్యాన్సర్ జబ్బు వచ్చింది.
అంకుల్!ఈ విషయం మా తల్లిదండ్రులకు నేను చెప్పలేదు.
అందుకే నాకు మాట ఇవ్వుమని అడుగుతున్నాను.
నేను చనిపోయిన పర్వాలేదు కానీ, నీకు భార్య, కొడుకు,కూతురులు అందరూ ఉన్నారు.వాళ్ళు చాలా బాధపడతారుఅని వేడుకుంటుంది.
ఈ చిట్టితల్లి మాటలు వినగానే డ్రైవరుకు నోటిమాటరాలేదు.
ఏడ్చుకుంటూ!సరే నమ్మా!
ఇప్పటినుంచి సిగరేట్ తాగను. నాలాంటి వాళ్లను తాగనివ్వనని సంజననకు మాట ఇస్తాడు.అప్పుడు సంజనకు చాలా ధైర్యం వస్తుంది.మెల్లమెల్లగా క్యాన్సరు నయమవుతుంది. మళ్లీ స్కూలుకు తయారై బస్సుఎక్కుతుంది.
సంజనా!ఇప్పుడు చూడు!నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అని డ్రైవర్ అంటాడు.
సంతోషంగా మళ్లీ డ్రైవర్ దగ్గరనే కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి