చెట్ల రక్షణ:- పొట్టోళ్ళ జయంతి-9వ,తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-బక్రిచెప్యాల-జిల్లా సిద్ధిపేట -9704865816
 తుక్కాపూర్ అడవి పచ్చదనంతో  కళకళలాడుతూ ఉండేది.ఊరివారు చెట్లకు కాసిన పండ్లను తెంపి జీవనం కొనసాగించేవారు.లలిత చిన్నప్పటి నుండి అడవిలో కొన్ని మొక్కలను నాటింది.స్కూల్ కు రోజు అదే దారిన వెళ్తుంది.చెరువు కట్టమీద నుండివెళ్ళుతూ తనునాటిన మొక్కలకు నీళ్లు పోసేది.
ఒకరోజు రంగయ్యకు ఆ పచ్చని చెట్లపైన కన్నుపడింది.ఈ చెట్లు నరికి అమ్మాలని చూస్తాడు.తను గొడ్డలితో నరకబోతుండగా లలిత చెట్టును గట్టిగా అలుము కుంటుంది.ఈ చెట్లను నరకొద్దు.మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది.ఈ చెట్లల్ల మా అమ్మను చూసుకుంటున్నాను.వీటిని నరకొద్దు.ఇంకేమైన పనిచేసుకపో అని బ్రతిమి లాడుతుంది.రంగయ్య ఎంతకు వినడు.అమ్మాయిపై కోపం పెంచు కుంటాడు.గట్టిగా అమ్మాయిని తోసి వేస్తాడు.ఈ చెట్లను కొట్టి అమ్మితే డబ్బులు వస్తాయి.దానితో నా కుటుంబాన్ని పోషించు కుంటాను అంటాడు.
ఈ చెట్లతో నీకు ఏమి లాభం చెప్పు అని లలితను అడుగుతాడు.నీవు బతకడానికి గాలి,నీరు,ఆహారం కావాలి.
అవన్నియు ఈచెట్ల వలెనే వస్తున్నాయి.చెట్లు లేకుండాపోతే అడవి జంతువులన్ని ఊర్లకు వస్తాయి.మనల నందరినీ కరుస్తాయి.ఈ చిన్న అమ్మాయిలో ఎన్ని మంచిగుణాలున్నాయని తెలుసుకుంటాడు.
ఇప్పటినుండి ఇంక వేరే ఏదైన పనిచేసుకుంటానని గొడ్డలిని చెరువులో పారేస్తాడు.
గంగమ్మ ప్రత్యక్ష మౌతుంది.ఇతని మార్పుకు సంతోషస్తుంది.అందరు నీలాగ ఉంటే ఎంత బాగుండని సంతోషపడుతుంది.
రంగయ్యకు బంగారు గొడ్డలిని బహుమతిగా ఇస్తుంది.దానితో రంగయ్య పెద్ద వ్యాపారం చేసుకుంటాడు.గంగమ్మ తల్లి లలితను మెచ్చుకుంటుంది.



కామెంట్‌లు