తల్లి ఆవేదన:- గర్నెపల్లి రక్షిత -9వ,తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల,సిద్దిపేట జిల్లా -9704865816
 ఒక ఊరిలో రామయ్య అనే కూలి ఉండేవాడు.అతని భార్య లింగమ్మ,మరియురెండు సంవత్సరాల కూతురు ఉండేది.రోజు అడవికెళ్లి కట్టెలు కొట్టి కుటుంబాన్ని పోషించుకునేవాడు.
ఒకరోజు కట్టెలు కొడుతుండగా  అనుకోకుండా పాము కాటుకు గురై చనిపోతాడు.అతని
భార్య ,కూతురు అనాథలై పోయారు.కుటుంబాన్ని పోషించుకోలేక చాలా బాధపడుతుండేది.ధైర్యం తెచ్చుకొని భర్త మాదిరి అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని అమ్ముకోవాలనుకున్నది.తన బిడ్డను సంకకెత్తుకొని, నెత్తిన సద్దిమూట,గొడ్డలి,తాడు తీసుకొని అడవికి పోయింది. కట్టెలు కొట్టి మోపుగా కట్టి నెత్తి మీద పెట్టుకొని ఎండలో నడుచుకుంటూ వస్తుంది.అది చూసిన ఊరిలో జనాలు ఈమెకు ఎంత కష్టం వచ్చింది అని బాధపడేవారు.పాపను చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఎవరు మాత్రం సహాయం చేయరు.ఒకరోజు అడవికెళ్లి వస్తుండగా తాగుబోతు వ్యక్తి వెంటపడతాడు.అతనిని తప్పించుకొని వస్తుంది.ఈ అవమానాలు భరించలేక అడవికి వెళ్లడం మానేసింది. మరి బిడ్డ ఆకలి  తీర్చడానికి ఏదైనా ఇండ్లలో పనిచేయాలనుకుంటది.ఎవరు కూడా పని ఇవ్వరు.తల్లి అన్నం తినకపోతే బిడ్డకు పాలు కూడా రావడం లేదు. ఈ విధంగా ఎన్నో బాధలు పడుతుంది.
ఒకరోజు భర్త లేని బతుకు ఎందుకని జీవితంపై నిరాశ చెందుతుంది.అమ్మాయిని బావి గడ్డమీద పడుకోబెట్టింది. బావిలో పడి చనిపోదామనే నిర్ణయానికి వస్తుంది.
ఆ పసికూతురు కొంగు పట్టి లాగుతుంది.అమ్మాఅమ్మా గుక్క పట్టి ఏడుస్తుంది.
వెంటనే తల్లి ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని అనుకుంటుంది.
బిడ్డ కోసమే బతకాలని నిర్ణయించుకుంటుంది.బిడ్డ పెరిగి పెరిగి పెద్దగయింది. పేదవారు కాబట్టి కష్టాలన్నీ వాళ్ళమ్మ బిడ్డకు తెలియజెప్పేది.
నువ్వు బాధపడకు అమ్మా! నేను మన ఊరి బడికి వెళ్లి బాగా చదువుకుంటాను ఏదైనా ఉద్యోగం సంపాదిస్తాను.
ఆ తర్వాత నిన్ను పువ్వుల పెట్టి చూసుకుంటాను అని బిడ్డ తల్లిని ఓదార్చుతుంది. అప్పుడు తల్లి బోరున ఏడ్చి తన బిడ్డను తన హృదయానికి అత్తుకుంటుంది. అనుకున్న మాదిరిగా కూతురు బాగా చదువుకుంది.
మంచి ఉద్యోగం
సంపాదించుకుంది.
పెళ్లిచేసుకుంది.తల్లిని పోషించుకుంటు హాయిగా జీవితం గడిపింది.



కామెంట్‌లు