ఒక ఊరిలో లేఖ,శశిరేఖ అనే స్నేహితురాళ్ళు ఉండేవారు.ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఎండాకాలం సెలవుల్లో లేఖ వాళ్ల అమ్మమ్మ ఇంటికి పోయింది.శశిరేఖ మాత్రం ఇంటి దగ్గరే ఉంది.వేరే ఊర్లకు వెళ్లడమంటే ఇష్టముండదు.
ఇంటి వద్ద అన్న,అక్కలతోటి ఆడుకునేది.అమ్మ,నాన్నలకు పొలం పనులల్లో తోడుగావెళ్లేది.అమ్మ పాడుతుండగా పాటలు నేర్చుకునేది.
లేఖ ఎప్పుడు వస్తుందో!ఏమో అని ఎదురుచూసేది.
ఎండాకాలం సెలవులు అయిపోయాయి.లేఖ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చింది.శశిరేఖను కలుసుకుంది.అమ్మమ్మ వాళ్ళ ఇంటిలో జరిగిన విషయాలన్నీ శశిరేఖకు చెప్పింది.
మళ్లీ పాఠశాల ప్రారంభమైంది.
లేఖ ఎనిమిదవ తరగతి.
శశిరేఖ 9వ తరగతి.ప్రతిరోజు కలిసి బడికి వెళ్లేవారు.
లేఖ బడికి పోకపోతే నేను కూడా బడికి వెళ్లనని శశిరేఖ అనేది.మంచిగా ఇంటివద్ద రకరకాల విషయాలు మాట్లాడుకునేవారు.
స్కూల్లో చీటికిమాటికి ఇద్దరు గొడవ పెట్టుకునేవాళ్ళు. వెంటనే కలుసుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి వారం రోజుల దాకా మాట్లాడుకునే వాళ్ళు కాదు.వీళ్లు ఎప్పుడు కలిసి ఉంటారో,ఎప్పుడు కొట్లాట పెట్టుకుంటారో మిగతా స్నేహితులకు అర్థం కాలేక పోయేది.
ఒకనాటి బాల దినోత్సవం లో పాటల పోటీలు నిర్వహిస్తారు. ఆ పోటీలలో లేఖ, శశిరేఖ ఇద్దరు పాల్గొంటారు.లేఖ పాటలు మామూలుగా పాడేది.శశిరేఖ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర ప్రతిరోజు పాటలు నేర్చుకునేది.ఆ అనుభవంతో శశిరేఖ గెలిచేది.ఎలాగైనా లేఖను గెలిపించాలని ఆ పోటీలో తను బాగా పాడలేకపోయింది.ఫలితాలలో లేఖ ప్రథమ స్థానం గెలుచుకున్నది.
అప్పుడు లేఖ,శశిరేఖను అడుగుతుంది.
ఎందుకని నువ్వు సరిగా పాట పాడ లేక పోయావు అని అంటుంది.
మన స్నేహానికి గుర్తుగా నువ్వే గెలవాలని నేను అలా తక్కువ చేసి పాడాను.నువ్వంటే నాకు నాకు పంచ ప్రాణం అని శశిరేఖ అంటుంది.
స్నేహం విలువ తెలిసిన దానివి కాబట్టి మన జీవితాంతం ఈ స్నేహాన్ని ఇలానే కొనసాగిద్దామని లేఖ తెలుపుతుంది.ఇదే బలమైన స్నేహం అని శశిరేఖ నిరూపించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి