పూజితకు పుట్టినరోజు సంధర్భంగా విలువైన చేతి గడియారం వాల్లమ్మ బహుమతిగా కొనిస్తుంది. అమ్మకు గుర్తుగా ప్రతిరోజు స్కూల్ కు పెట్టుకొస్తుంది. రజిత,విజిత,పూజితకు మంచి స్నేహితులు.ఒకరి నిడిసి ఒకరు ఉండలేరు.రజిత, విజిత గడియారాన్ని చూస్తారు.ఎంత బాగుందే పూజిత నీ గడియారం అని రజిత అంటుంది.
నాకు పుట్టినరోజు కానుకగా మా అమ్మ కొనిచ్చింది.
గడియారం చూసుకున్నప్పుడల్లా
మా అమ్మ గుర్తుకొస్తుంది. అందుకని దీన్ని ప్రేమగా చూసుకుంటాను.
ఓ గడియారం దీనికొక్కదానికే ఉన్నట్లు ఫోజుకొడుతుందని విజిత అంటుంది.
అలా అనొద్దువిజితా! దానికుంటే మనకున్నట్లేగా అని రజిత అంటుంది.
ముగ్గురు స్నేహితురాళ్లు మధ్యాహ్నభోజనం ముగించుకొని
ఆడుకోవడానికి వెళతారు.
పూజిత తన గడియారాన్ని రజితకు పెట్టుకొమ్మని ఇచ్చి వాలీబాల్ ఆడుతుంది.
అప్పుడు రజిత పెట్టుకున్న గడియారాన్ని చూస్తానని విజిత తీసుకంటుంది.
అబ్బా!
గడియారం ఎంతబాగుంది.మా అమ్మకూడా నాకు కొనిస్తే ఎంతబాగుండు అని మనసులో విజిత అనుకుంటుంది.
షాపు కెళ్లి పూజితకు,రజితకు తినడానికి చాక్లెట్స్ తీసుకొస్తానని వెళ్తుంది.
అనుకోకుండా రాయి
తగిలి కిందపడింది.
గడియారం పగిలి పోయింది.
కన్నీరు,మున్నీరుగా ఏడుస్తుంది.
పూజిత ఏమంటదో అని భయపడుతుంది.
విజిత ఇంకా రాకపోయేసరికి రజిత వెళుతుంది.
తోవలో విజిత ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే రజిత చూస్తుంది.
ఏమైందే అలా ఏడుస్తున్నావు అని రజిత అడుగు తుంది.
పూజిత గడియారం పగిలి పోయింది.
ఎంత తిడుతుందోనని బాధేస్తుందని రజిత మీదపడి ఏడుస్తుంది.
రజిత ఓదార్చుతుంది.
అంతలో పూజిత రానేవచ్చింది.రజితా నా గడియారమివ్వు అని పూజిత అంటుంది.విజిత చేసిన తప్పును రజిత తనపై వేసుకుంటుంది.సారీ పూజిత! అనుకోకుండా కింద పడ్డాను.గడియారం పగిలి పోయింది .అనగానే పూజిత బోరున విలపిస్తుంది.ఎంత పని చేశావే! పెట్టుకొమ్మనిస్తే పగులకొడతవా!నమ్మక ద్రోహి అంటుంది.
మేడందగ్గరకు వెళదాం పదా!అంటు ముగ్గురు వెళతారు.జరిగిన విషయం చెపుతారు.మేడం రేపు మీరు స్కూల్ కు రాంగ గడియారం కోనుక్కరండి నేను డబ్బులిస్తానని రజిత అంటుంది.సరే నేను తీసుక వస్తానని సునీత మేడం చెపుతుంది.తెల్లారి సునీత మేడం కొత్త గడియారం తీసుకవచ్చి పూజితకిస్తుంది.
తెల్లవారినుండి రజిత బడికి రావడంలేదు.గడియారం డబ్బులు సంపాదించాలని వాళ్ల అమ్మతో పనికి వెళుతుంది.రజిత బడికి ఎందుకు రావడంలేదు అని సునీత మేడం అడుగుతుంది.
ఏమో మేడం మీరు డబ్బులు అడుగు తారని రావడంలేదేమో
అని పూజిత అంటుంది.
నేను చేసిన తప్పును రజిత తనపై వేసుకున్నదనీ విజిత మేడానికిచెబుతుంది.
అయ్యో! ఎంతపని చేశావమ్మ! మేడం బాధ పడుతుంది.
ఎందుకు రావడంలేదో
తెలుసుకుందాం పదండి.
అంటూ మేడం బండిమీద పూజిత,విజితలను ఎక్కించుకొని వెళుతుంది.
సగం దూరం వెళ్లగానే నాట్లేసే రజితను విజిత చూస్తుంది.బండిదిగి రజిత దగ్గరకు వెళతారు.నమస్కారం మేడం నా కోసం ఇంతదూరం వచ్చారా!నన్ను క్షమించండనగానే మేడం ఓదార్చుతుంది.విజిత జరిగిన విషయం నాకంతా చెప్పింది.
నీ మంచితనాన్ని నేనర్థంచేసుకున్నాను.
డబ్బులు ఇవ్వాల గాకపోతే రేపు సంపాదించుకోవచ్చు.
విలువైన చదువును దూరంచేసుకోవద్దు అని హితబోధ చేస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి